Horse Airlifted : గ్రేట్ రెస్క్యూ.. గుర్రాన్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు

Horse Airlifted : గుర్రం సగటు ఆయుష్షు 25 నుంచి 30 ఏళ్ళు మాత్రమే. అంటే.. వాటికి అది చాలా పెద్ద ఏజ్.

Published By: HashtagU Telugu Desk
Horse airlifted

Horse airlifted

Horse Airlifted : గుర్రం సగటు ఆయుష్షు 25 నుంచి 30 ఏళ్ళు మాత్రమే.

అంటే.. వాటికి అది చాలా పెద్ద ఏజ్.

మనకు 70 ఏళ్ళ తర్వాత ఎలాగైతే వీక్ నెస్ ఎక్కువవుతుందో..  అలాగే గుర్రాలకూ 25 ఏళ్ళు దాటాక వీక్ నెస్ పెరుగుతుంది.

25 ఏళ్ళ వయసున్న ఓ గుర్రం నడుస్తూ.. ఒక్కసారిగా జారిపడిపోయి గాయాలపాలైంది.

అది అస్సలు కదల లేని.. లేచి నిలబడలేని  స్థితిలో ఉంది.

దీంతో ఆ గుర్రం  ఓనర్ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశాడు. 

వాళ్ళు వచ్చి ఆ గుర్రాన్ని హెలికాఫ్టర్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేసుకొని.. సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

Also read : Juice For Healthy Skin: మీరు ఫిట్‌గా ఉంటూ.. అందంగా కనిపించాలనుకుంటున్నారా..? అయితే ఈ జ్యూస్ ట్రై చేయండి..!    

ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఆరెంజ్ కౌంటీలో చోటుచేసుకుంది. “నా గుర్రం పేరు ఓబి (Obe). దాన్ని చాలా ఏళ్లుగా పెంచుకుంటున్నాను. అది కళ్ళు తిరిగి కింద పడిపోతే తట్టుకోలేకపోయాను.  వెంటనే అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేశాను. వాళ్ళు వచ్చి నా గుర్రాన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడారు. ఒక జంతువు ప్రాణాలను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది చూపిన చొరవ మెచ్చుకోదగినది” అని గుర్రం యజమాని చెప్పాడు. ప్రస్తుతం తన గుర్రం ఆరోగ్యం బాగానే ఉందని, కోలుకుంటోందని తెలిపాడు. గుర్రాన్ని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు(Horse Airlifted) వైరల్ అవుతున్నాయి. ఆరెంజ్ కౌంటీ అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్ చేసిందంటూ నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

  Last Updated: 30 Jul 2023, 08:18 AM IST