Site icon HashtagU Telugu

Heart Attack: కోచింగ్ సెంటర్ లో యువకుడికి హార్ట్ ఎటాక్.. మృతి

Heart Attack

Heart Attack

Heart Attack: ఓ ఐదేళ్ల క్రితం వరకు హార్ట్ ఎటాక్ పేరు అరుదుగా వినిపించేది. గుండె జబ్బులు కేవలం 50, 60 ఏండ్ల వారికి మాత్రమే వచ్చేవి. నూటిలో ఏ ఇద్దరో ముగ్గురికో వచ్చేవి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. ఇటీవలి కాలంలో పెరుగుతున్న హఠాత్తు గుండెపోటు మరణాలు కలవరానికి గురి చేస్తున్నాయి. యువకులు సైతం ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఉదంతాలు చూస్తున్నాం

దేశంలో గత కొన్ని నెలలుగా గుండెపోటు కేసులు ఎక్కువవుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం శీతాకాలంలో దీని కేసులు మరింత పెరుగుతాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో యువకుడికి గుండెపోటు వచ్చింది. కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. అంతకుముందు గత నెలలో ఇండోర్‌లో గుండెపోటుతో మరణించిన మరొక కేసు నమోదైంది.

మృతుడి పేరు రాజా. రాజా వయస్సు 18 సంవత్సరాలు. రాగోలి నివాసి. రాజా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన బిఎ (BA) చివరి సంవత్సరం చదువుతో పాటు,మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) పరీక్షకు కూడా సిద్ధమవుతున్నాడు. మిగతా రోజులలాగే నిన్న బుధవారం ఇన్‌స్టిట్యూట్‌లో కూర్చొని క్లాసులు వింటున్నాడు. ఆయనతోపాటు పలువురు విద్యార్థులు కూడా ఉన్నారు. చదువుతున్న సమయంలో రాజాకు హార్ట్ ఎటాక్ వచ్చి టేబుల్ మీదనే కుప్పకూలిపోయాడు. సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది. రాజా క్లాస్‌లో కూర్చున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో అతను అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. అతని తోటి విద్యార్థులు రాజాను కదిలించడంతో రాజా కళ్లుతెరిచి చూశాడు. అయితే క్షణాల్లో రాజా మళ్ళీ గుండెపోటుకు గురయ్యాడు. అతన్ని టవర్ స్క్వేర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించగా మృతి చెందాడు.

Also Read: AP Politics: బాలకృష్ణ, చంద్రబాబు లాంటివారు జూ.ఎన్టీఆర్ ను ఏం చెయ్యలేరు: కొడాలి నాని

Exit mobile version