Site icon HashtagU Telugu

Blood Pledge : ‘‘చోరీ చేస్తే సూసైడ్’’.. ఉద్యోగులతో సంతకాలు చేయించుకున్న బ్యాంక్

Japan Shikoku Bank Employees Blood Pledge

Blood Pledge : ఏదైనా జాబ్‌లో చేరేటప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండీషన్స్‌ పెడతారు. వాటికి అంగీకారం తెలిపితేనే ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆఫీసులో క్రమశిక్షణతో మెలగాలి.. తోటి వారితో మంచిగా ప్రవర్తించాలి.. టైమింగ్స్‌ను ఫాలో కావాలి లాంటి నిబంధనలను కంపెనీలు పెడుతుంటాయి. అయితే ఒక బ్యాంకు మాత్రం ఉద్యోగులకు దారుణమైన కండీషన్ పెట్టింది. రక్తంతో డాక్యుమెంట్‌పై ఉద్యోగులతో సంతకం చేయించుకుంది. ఒకవేళ తాము బ్యాంకులో ఏవైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడితే..  సూసైడ్ చేసుకుంటామని వారితోనే రాయించింది. అందుకు అంగీకరించే వాళ్లే తమ బ్యాంకులో జాబ్ చేయాలని అల్టిమేటం ఇచ్చింది.

Also Read :Gautam Gambhir : స్వ‌దేశానికి గౌతం గంభీర్‌.. మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లేది అప్పుడే..

జపాన్‌ దేశాన్ని మనం ఒక రోల్ మోడల్‌గా చెప్పుకుంటాం. జపనీయులు బాగా కష్టపడతారని, వాళ్లు క్రమశిక్షణగా నడుచుకుంటారని మనకు తెలుసు. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకులు, బీమా కంపెనీల్లో కొన్ని జపాన్‌లోనే ఉన్నాయి. షికోకు అనేది ఒక జపాన్ బ్యాంక్. ఇది గత 220 ఏళ్లుగా నడుస్తోంది. ఇందులో దాదాపు 1300 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ బ్యాంకు  కస్టమర్లకు మంచి సేవలు అందిస్తుంటుంది. బ్యాంకు అంటేనే డబ్బులతో వ్యవహారమని మనకు తెలుసు. ఉద్యోగులు నిత్యం కోట్లాది రూపాయల మధ్య ఉంటారు. కోట్లాది రూపాయలతో ముడిపడిన లావాదేవీలను షికోకు బ్యాంకు ఉద్యోగులు నిర్వర్తిస్తుంటారు. ఈక్రమంలో ఏ ఒక్క ఉద్యోగి అత్యాశకు పోయినా.. బ్యాంకు జేబుకు చిల్లు పడుతుంది. అలాంటి అనైతిక ఆలోచనను తమ ఉద్యోగులకు రాకుండా చేసేందుకు షికోకు బ్యాంకు కీలక తీర్మానం చేసింది. దానిపై తమ ఉద్యోగులతో సంతకం చేయించింది.  బ్యాంకుకు సంబంధించిన డబ్బును దొంగిలించినా లేదా దొంగతనంలో ఇతరులకు సహకరించినా దాన్ని చెల్లించి, ఆత్మహత్య చేసుకుంటామని ఉద్యోగులతో బాండ్ రాయించుకుంది.

Also Read :Mumbai Terror Attack: 26/11 ఉగ్రదాడికి 16 ఏళ్లు.. ఆ రోజు ముంబైలో ఏం జరిగిందంటే..

ఈవివరాలను షికోకు బ్యాంకు తమ అధికారిక వెబ్‌సైటులో వెల్లడించడం గమనార్హం. ఇలాంటి చర్యల వల్ల కస్టమర్లు తమను మరింతగా నమ్ముతారని షికోకు బ్యాంకు యాజమాన్యం భావిస్తోంది. వాస్తవానికి ఇలాంటి నిబంధనలతో సంతకాలు చేయించుకోవడం అనేది క్రూరత్వం కిందికి వస్తుందని బ్యాంకింగ్ రంగ పరిశీలకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ బ్యాంకు ఉద్యోగులకు ఏదైనా జరిగితే.. సూసైడ్ అగ్రిమెంటు వివాదానికి కేంద్రబిందువుగా మారే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అయితే దీనిపై షికోకు బ్యాంకు నిర్వాహకుల వాదన మరోలా ఉంది. ఈ బ్యాంకును స్థాపించినప్పుడు దాని ప్రెసిడెంట్‌ మియురాతో పాటు జాబ్స్‌లో చేరిన 23మంది ఇదేవిధంగా రక్తంతో బాండ్లు(Blood Pledge) రాసిచ్చారని గుర్తు చేస్తున్నారు.  అదే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నామని షికోకు బ్యాంకు నిర్వాహకులు చెబుతున్నారు. తమ చర్యలను సమర్ధించుకుంటున్నారు.