Site icon HashtagU Telugu

UP : ముద్దు ఇస్తే..అటెండెన్స్ వేస్తా – స్కూల్ ఉపాధ్యాయుడి రాసలీలలు

Kiss Teacher

Kiss Teacher

చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు (School Teacher)..అవి పక్కన పెట్టి మరో ఉపాధ్యాయురాలిని ముద్దు అడిగిన ఘటన ఉత్తర ప్రదేశ్ (UP) లో చోటుచేసుకుంది. పాఠశాలలో కొత్తగా తీసుకొచ్చిన డిజిటల్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అటెండెన్స్ కోసం ఓ ఉపాధ్యాయుడు టీచర్ ను ముద్దు పెట్టమని అడిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఉత్తర ప్రదేశ్ సర్కార్..టీచర్లు, పిల్లల కోసం డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ తరుణంలో ఉన్నావో ప్రాంతంలో అటెండెన్స్ కోసం ఓ ఉపాధ్యాయుడు టీచర్ ను ముద్దు పెట్టమని అడిగాడు. సదరు టీచర్ ముద్దు పెట్టేందుకు నిరాకరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చుసిన నెటిజన్లు సదరు ఉపాధ్యాయుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులు ఇలా దారి తప్పితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సమాజం ఎటువెళ్తుందో అర్ధం కావడం లేదని..ఎవర్ని నమ్మాలో..ఎవర్ని నమ్మకూడదో తెలియడం లేదని..ఇలాంటి కామాంధులు ఉన్న స్కూల్స్ కు తమ పిల్లలను ఎలా పంపిలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

Read Also : Naga Chaitanya – Shobitha : ఓహ్..శోభిత కు కూడా చైతు సెకండేనా..?