Site icon HashtagU Telugu

Flight Ticket Cancellation : ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేస్తే జస్ట్ 20 రూపాయలు రిటర్న్ వచ్చాయి.. వైరల్ అవుతున్న IAS ఆఫీసర్ ట్వీట్..

IAS Officer refunded with only 20 rupees on Flight Ticket Cancellation

IAS Officer refunded with only 20 rupees on Flight Ticket Cancellation

సాధారణంగా మనం ఏదైనా జర్నీ చేయాలంటే ఎందుకన్నా మంచిదని టికెట్లు(Tickets) ముందే బుక్ చేసుకుంటాం. అప్పటికి అప్పుడు ప్రయాణం అయితే తప్పదు కానీ మిగతా వాటికి చాలా ప్లాన్ గా ఉంటాం. అది ట్రైన్ జర్నీ అయినా విమాన ప్రయాణమైనా( Flight journey). ఒకవేళ ఆ ప్రయాణం క్యాన్సిల్ (Ticket cancelation) అయితే ఎంతో కొంత డబ్బులు కట్ అయ్యి మిగతా డబ్బులు మన చేతికి ( Refund )వస్తాయి. అయితే మనకి వెనక్కి వచ్చే డబ్బులు మనం జర్నీని క్యాన్సిల్ చేసిన సమయం మీద ఆధారపడి ఉంటాయి అన్న విషయం మనకు తెలిసిందే.

తాజాగా ఒక ఐఏఎస్(IAS) ఆఫీసర్ రూ.13,820 విలువైన ఫ్లైట్ టికెట్ ని క్యాన్సిల్ చేశారు. కానీ వచ్చిన డబ్బులు చూసి షాక్ అయిన అతను ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బీహార్ కు చెందిన ఒక ఐఏఎస్ రాహుల్ కుమార్ ట్విట్టర్లో తన క్యాన్సిలేషన్ అనుభవాన్ని స్క్రీన్ షాట్స్ తో సహా షేర్ చేసుకున్నారు.

ఫ్లైట్ టికెట్ కోసం ఎయిర్ లైన్స్ కు అతను 13820 రూపాయలు చెల్లించారు అయితే ఆయన టికెట్ క్యాన్సిల్ చేస్తే వెనక్కి వచ్చింది ఒక 20 రూపాయలు మాత్రమే. ఎయిర్ లైన్స్ క్యాన్సిలేషన్ ఫీజు రూ. 11,800, GI క్యాన్సిలేషన్ ఫీజు రూ.1200, జిఐ కన్వీనియన్స్ ఫీజు రూ.800 మినహా ఆయన చేతికి వచ్చింది కేవలం 20 రూపాయలు మాత్రమే. అమౌంట్ చూసి షాక్ అయిన రాహుల్ ట్విట్టర్లో తన అనుభవాన్ని పంచుకున్నారు. తనకు వచ్చిన రిఫండ్ అమౌంట్ కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటే చెప్పండి అంటూ రాహుల్ పెట్టిన సెటైరికల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ పెడుతున్నారు. ఆ రిఫండ్ అమౌంట్ తో షేర్లు కొనండి అని ఒకరు, ఓ ఫ్లైట్ కొనుక్కోమని ఒకరు, అసలు మీకు రిఫండ్ వచ్చినందుకు ముందుగా కంగ్రాట్స్ అని.. ఇలా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

 

Also Read : Aadhaar virtual ID: ఇకపై ఆధార్ లేకుండానే ఆ సేవలన్నీ పూర్తి.. ఎలా అంటే?