Viral : ఎక్కువగా జ్యూస్ లు అడుగుతుందని నవ వధువును పుట్టింట్లో వదిలేసిన భర్త

భార్య పదే పదే జ్యూస్ అడుగుతుందని చెప్పి భర్త ఆమెను పుట్టింట్లో వదిలేసి వెళ్లిన ఘటన వైరల్ గా మారింది

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 02:38 PM IST

ఇటీవల భార్య భర్తలు విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేకుండా అయిపోయింది. చిన్న చిన్న కారణాలతో విడాకుల వరకు వెళ్తున్నారు. ఒకప్పుడు పెళ్లి అనే మాటకు ఎంతో బాధ్యత , నమ్మకం , ప్రేమ , భరోసా వంటివి ఉండేవి..కానీ ఇప్పుడు ఆలా కాదు పెళ్లి అంటే మూడు నెలల ముచ్చటగా మారింది. చిన్న చిన్న కారణాలతో విడిపోతూ పెళ్లి అనే పదానికి విలువ లేకుండా చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ లో ఇలాగే జరిగింది. భార్య పదే పదే జ్యూస్ అడుగుతుందని చెప్పి భర్త ఆమెను పుట్టింట్లో వదిలేసి వెళ్లిన ఘటన వైరల్ గా మారింది. అంతే కాదు పెళ్ళై ఎంతో కాలం కూడా కాలేదు. పట్టుమని పది రోజులు మాత్రమే. ఎవరైనా పెళ్లి చేసుకున్న కొత్తలో భార్యను ఎంతో ఇష్టంగా చూసుకుంటాడు..ఆమె ఏం అడిగిన కాదనకుండా..డబ్బుకు వెనకడుగు వెయ్యకుండా ఆమె కోరిక తీర్చాలని భావిస్తారు. కానీ ఇక్కడ ఇతడు మాత్రం భార్య అన్నం తినకుండా ఎక్కువగా జ్యూస్ అడుగుతుందనే కారణంతో వదిలేయడం చాల సిల్లీగా అనిపిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

వివరాల్లోకి వెళ్తే.. గత నెల 24న కాసిరెడ్డిపల్లెకు చెందిన సుంకరి ప్రవీణ్‌కు మంచిర్యాలకు చెందిన ఓ యువతి (22)తో వివాహమైంది. పెళ్లయిన నాలుగో రోజే భర్త వధువును ఆమె తల్లిగారి ఇంటి వద్ద విడిచిపెట్టాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. ఆ యువతి ఇంట్లో అన్నం తినటం లేదని.. జ్యూస్‌లే తాగుతుందని ప్రవీణ్‌ చెప్పుకొచ్చాడు. ఆమెను పుట్టింట్లో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇదే విషయమై అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కనుకున్నారు. అయితే వారు తమకేమీ సంబంధం లేదని… నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుకొచ్చారు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసుకుందామని చెబుతూ వచ్చారు. అమ్మాయితో కాపురం చేయటం అబ్బాయికి ఇష్టం లేదని అందుకే ఏవో సాకులు చెబుతూ తమ కూతురు జీవితం నాశనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ అమ్మాయిని మెట్టినింటికి తీసుకెళ్తే.. తాళం వేసుకొని ఎటు వెళ్తున్నారని తెలిపారు. ఇలా అయితే కుదరదని చెప్పి పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగింది చెప్పారు. దీంతో ఎస్సై..ప్రవీణ్ ను పోలీస్ స్టేషన్ కు రావాలని ఆదేశించారు. మరి ఏజరుగుతుందో చూడాలి.

Read Also : Kishan Reddy : ప్రధానిగా దేశానికి ఎవరు కావాలి?..మోడీనా?..రాహుల్‌ గాంధీనా..?: కీషన్‌ రెడ్డి ప్రశ్న