Site icon HashtagU Telugu

India’s first Jaggery Rum : మందుబాబులు అతి త్వరలో బెల్లం రమ్ వచ్చేస్తోంది..

Huli

Huli

మందుబాబులకు గుడ్ న్యూస్..అతి త్వరలో బెల్లం రమ్ (Jaggery Rum) రాబోతుంది. ఇప్పటివరకు రకరకాల పండ్లతో తయారుచేసిన రమ్ లను తాగి ఎంజాయ్ చేసారు. ఇక ఇప్పుడు బెల్లం తో తయారు చేసిన రమ్ రాబోతుంది. దేశంలోనే ఫస్ట్ టైం lబెల్లంతో తయారు చేసిన దేశీయ ఒరిజినల్ రమ్ అని చెపుతున్నారు. అతి త్వరలో కర్ణాటక మార్కెట్లోకి ఈ రమ్ రాబోతుంది. హులి (టైగర్) (Huli) పేరుతో ఆగస్టు 15న రానున్న ఈ మైసూర్ స్పెషల్ బ్రాండ్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇంట్లోని ముఖ్యమైన పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన బెల్లం రమ్ను ప్రీమియం రమ్ గా అభివృద్ధి చేశారు. 750ml బాటిల్ బేస్ ధర రూ.630 కాగా, పన్నులు కలుపుకొని రూ.2,800కి లభించనుంది. అంత పెట్టి తాగుతారా..? అనే సందేహం అవసరం లేదు. మార్కెట్ లోకి కొత్త రకం మద్యం వస్తుందంటే మొదటి దాని టెస్ట్ చూడాలని..అందుకోసం ఎంతైనా పెడతామని మందుబాబులు నిత్యం చెపుతుంటారు. సో…బెల్లం రమ్ కు ఫుల్ గిరాకీ అన్నమాట.

Read Also : NTR-Allu Arjun : ఒకే వేదిక మీద ఎన్టీఆర్, అల్లు అర్జున్..?