Site icon HashtagU Telugu

Lucky Chair : కుర్చీ కొని కోటీశ్వరుడు అయ్యాడు.. ఎలా ?

Lucky Chair

Lucky Chair

Lucky Chair : ఏది కలిసి రావాలన్నా అదృష్టం ఉండాలి.. 

అదృష్టం ఏ రూపంలోనైనా ఎదురుకావచ్చని అంటారు పెద్దలు.. 

ఒకతనికి మాత్రం అదృష్టం కుర్చీ రూపంలో ఎదురొచ్చింది.. 

అతడు రూ.4 వేలకు కొన్న పాత కుర్చీని వేలం వేస్తే రూ. 82 లక్షలు వచ్చాయి.. 

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కు చెందిన జస్టిన్ మిల్లర్ ఫేస్‌బుక్ మార్కెట్‌ ప్లేస్‌లో ఏదో వెతుకుతున్నప్పుడు ఒక పాత కుర్చీని(Lucky Chair) చూశాడు. అది చూడటానికి అట్రాక్టివ్ గా ఉంది. ధర 4000 రూపాయలు అని అక్కడ రాసి ఉంది. పెద్దగా ఆలోచించకుండా.. ప్రత్యేకంగా మచ్చలున్న ఆ కుర్చీని కొనేశాడు. పార్శిల్ ద్వారా ఇంటికి వచ్చిన కుర్చీని తెరిచినప్పుడు మిల్లర్ ఉత్సుకత మరింత  పెరిగింది. ఎందుకంటే అది పాత కుర్చీ. దాని కఠినమైన తోలు, ఆకర్షణీయమైన డిజైన్‌ను చూసిన మిల్లర్ దానిని వేలానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ  కుర్చీని ప్రముఖ వేలం సంస్థ  sothebys  కి పంపాడు. దాన్ని వేలం వేయాలని కోరాడు.

Also read : God Father trailer: నేను ఉన్నంతవరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను!

బిడ్డింగ్‌కు ముందు.. మిల్లర్ పంపిన కుర్చీని sothebys తనిఖీ చేసింది. చాలా మంది నిపుణులు ఈ కుర్చీ స్పెసిఫికేషన్‌లను సమీక్షించారు. అది 1935లో ప్రముఖ డిజైనర్ ఫర్ట్స్ హెన్నింగ్‌సన్ రూపొందించిన కుర్చీగా గుర్తించారు. దీని చరిత్రను పరిశీలించిన తర్వాత sothebys ఈ కుర్చీని  50,000 డాలర్లకు వేలానికి పెట్టింది. వేలం పాటలో కుర్చీ ధర 85,000 డాలర్లకు పెరిగింది. చివరగా, ఈ కుర్చీ 1,07,950 డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే 82 లక్షల రూపాయలు జస్టిన్ మిల్లర్ కు వచ్చాయి. కేవలం రూ.4 వేలకు కుర్చీ కొన్న మిల్లర్ ఇప్పుడు దాదాపు కోటీశ్వరుడు అయ్యాడు. కాలు కదపకుండా.. మిల్లర్ తన జేబులో ఆ డబ్బులు  వేసుకున్నాడు. ఈ మొత్తాన్ని బ్యాంకులో ఉంచుతానని చెప్పాడు.  మిల్లర్  రూ.82 లక్షలు సంపాదించిన తర్వాత.. ఇప్పుడు అతడి స్నేహితులు ఫేస్‌బుక్ మార్కెట్‌ ప్లేస్‌లో పాత వస్తువులను వెతకడం ప్రారంభించారు.

Exit mobile version