పురాతన కాలంలో ఇటుకలు లేనప్పుడు, మన పెద్దలు కొండ రాళ్లను ఉపయోగించి ఇళ్లు నిర్మించేవారు. ప్రత్యేకమైన శిల్పకళ, అత్యాధునిక నిర్మాణ శైలితో ఈ ఇల్లులు శతాబ్దాలుగా నిలిచి ఉన్నాయి. ఈ కట్టడాలను నిర్మించడానికి డంకు సున్నం, గానుగ తిప్పిన మిశ్రమం ఉపయోగించేవారు. అత్యంత బలమైన ఈ గృహాలు శత్రు దళాల దాడులను తట్టుకునేలా రూపొందించబడ్డాయి. కానీ ఇప్పుడు అలాంటి నిర్మాణాలు లేవు. ఇటుకలు , బ్రిక్స్ తో నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ హైదరాబాద్(Hyderabad)కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలోని హన్మంతరావుపేట (Hanmanthraopet ) గ్రామానికి వెళితే ఇప్పటికీ శతాబ్దాల కట్టడాలను చూడొచ్చు.
MLC election : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల
గ్రామస్థుల కథనాల ప్రకారం.. 40 ఏళ్ల క్రితం నిర్మించిన కొన్ని ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. అయితే 100 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లు (100 Years Old Houses) మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఇటుకల స్థానంలో ఉపయోగించిన బలమైన రాళ్లు, ఆ సమయంలో నిర్మాణానికి వాడిన డంకు సున్నం, గానుగ తిప్పిన మిశ్రమమేనని గ్రామస్థులు చెబుతున్నారు. ఇవి వేసవిలో చల్లగా, శీతాకాలంలో వేడిగా ఉండే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. కొన్ని ఇళ్లకు పైకప్పులు విరిగిపోవడంతో గ్రామస్థులు టేకు, వేప కలప, నల్లమట్టి ఉపయోగించి మరమ్మతులు చేస్తున్నారు. అయితే వీటిని పూర్తిగా కూల్చడం మాత్రం గ్రామస్థులు ఇష్టపడటం లేదు.
Betting App Case : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు శ్యామల
ఈ పురాతన కట్టడాలను వీక్షించేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. అప్పట్లో యంత్రాలేమీ లేకుండా, కేవలం మనుషులే 20 నుంచి 50 కిలోల రాళ్లను ఎత్తుకుని రెండంతస్తుల భవనాలను నిర్మించడం గొప్ప విషయమే. ఇలాంటి గృహ నిర్మాణ శైలిని ప్రస్తుత తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో గ్రామస్థులు వాటిని మరమ్మతు చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ అద్భుత నిర్మాణాలను చూడాలనుకుంటే, హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలోని హన్మంతరావుపేట గ్రామానికి వేసవి సెలవుల్లో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని అప్పటి ఇళ్లను చూసే ప్రయత్నం చెయ్యండి.