GT Mall : రైతు పంచెకట్టు దెబ్బ..వారం పాటు మాల్ మూత

బెంగుళూర్ లోని జీటీ మాల్ కు సినిమా చూసేందుకు ఓ రైతు...ఆయన కొడుకు వెళ్లారు. రైతు పంచెకట్టుతో ఉండడం తో ఆయన్ను లోపలి అనుమతించలేదు

Published By: HashtagU Telugu Desk
A Farmer Dhothi

A Farmer Dhothi

రైతే (Farmer ) దేశానికి వెన్నెముక అంటారు..కానీ ఇప్పుడు ఆ రైతును ఓ మనిషిలాగా కూడా చూడడం లేదు. ఆయన్ను ఓ అంటరాని వాడ్నిలాగా చూస్తూ అవమానిస్తున్నారు. ఆనాడు తెల్లదొరలు పంచెకట్టుతో రైలు ఎక్కిన గాంధీని కిందకు తోసేస్తే..ఈ నాడు పంచెకట్టు తో ఓ రైతు ట్రైన్ ఎక్కిన..మాల్ లోకి వెళ్లిన బయటకు పంపిస్తున్నారు. గతంలో ఓ మెట్రో స్టేషన్ లోకి పంచెకట్టుతో వచ్చాడని చెప్పి బయటకు పంపేసిన వైనం సంచలనం రేపగా..తాజాగా అలాంటి ఘటనే ఇప్పుడు బెంగుళూరు లో చోటుచేసుకుంది. ఓ రైతు (farmer ) పంచెకట్టు (Dhoti )తో మాల్ లోపలి వెళ్తుండగా సిబ్బంది అడ్డుకొని బయటకు పంపేసిన ఘటన వైరల్ గా మారింది.

బెంగుళూర్ లోని జీటీ మాల్ (GT Mall) కు సినిమా చూసేందుకు ఓ రైతు…ఆయన కొడుకు వెళ్లారు. రైతు పంచెకట్టుతో ఉండడం తో ఆయన్ను లోపలి అనుమతించలేదు. ఈ ఘటనలు వీడియో తీసిన సదరు కొడుకు..సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో అది కాస్త వైరల్ గా అయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లతో పాటు రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి మాల్ యాజమాన్యం రైతన్నకు క్షమాపణలు చెప్పింది. అయినా విషయం అక్కడితో ఆగలేదు..ఈ విషయం గురించి యావత్ దేశం మొత్తం చర్చనీయాంశం కావడం.. రాజకీయంగా దుమారం రేగింది. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. ఏడు రోజుల పాటు ఆ మాల్ను మూసివేయాలంటూ ఆదేశాలిచ్చింది. ఇలాంటి ప్రవర్తన వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడం కిందికే వస్తుందంటూ ఆగ్రహించింది. కాగా దీనిపై యాజమాన్యం క్షమాపణ చెప్పకపోతే మాల్ని ముట్టడిస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి. దీంతో మాల్ యాజమాన్యం దిగొచ్చి రైతును సత్కరించి క్షమాపణలు కోరింది.

Read Also : Runa Mafi : రుణమాఫీ అమలుకావడంతో..రాజీనామా పై స్పందించిన హరీశ్ రావు

  Last Updated: 18 Jul 2024, 07:10 PM IST