Site icon HashtagU Telugu

Farewell Dance Video: ఫేర్ వెల్ పార్టీలో దుమ్మురేపే డాన్స్.. అమ్మాయి సెక్సీ స్టెప్పులకు పడిపోవాల్సిందే

Dance

Dance

డ్యాన్స్ వీడియోలు (Dance Video) చూడటం సోషల్ మీడియాలో చాలా మందికి కాలక్షేపంగా మారింది. సాగర సంగమం లాంటి క్లాసిక్ మొదలుకొని వాల్తేరు వీరయ్య లాంటి మాస్ బీట్స్ సాంగ్స్ స్టెప్పుల వరకు ఆస్వాదించేందుకు ఉత్సాహం చూపుతున్నారు నెటిజన్స్. ఈ నేపథ్యంలో ఎన్నో హిట్స్ సాంగ్స్ కు చేసిన డాన్స్ వీడియోలు ఇంటర్నెట్ (Internet) లో సంచలనం రేపుతూనే ఉన్నాయి. తాజాగా ఓ అమ్మాయి బాలీవుడ్ (Bollywood) పాటకు సెక్సీ స్టెప్పులతో, మదిని దొచుకునే హావభావాలతో డాన్స్ చేసింది.

స్వాతహాగా డాన్సర్, ఆర్టిస్ట్ అయినా అమ్మాయి (Girl) తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో (Dance) అందర్నీ ఫిదా చేసింది. అందమైన ఎరుపు రంగు చీర ధరించి ఐకానిక్ బాలీవుడ్ పాట చోలీ కే పీచే క్యా హైకి డాన్స్ చేసింది. పాటకు అనుగుణంగా స్టెప్పులు వేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను కొద్ది టైమ్ లోనే అత్యధిక వ్యూస్ వచ్చాయి.

చోలీ కే పీచే క్యా హై పాటకు ఓ అమ్మాయి డ్యాన్స్ చేసిన వీడియో సాంగ్ సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. సో సెక్సీ, వారెవ్వా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 1993 యాక్షన్ డ్రామా చిత్రం అయిన ఖల్ నాయక్ లోని ఈ పాట ఇప్పటికే ఓ ఊపు ఉపేస్తోంది. ఈ పాటను అల్కా యాగ్నిక్, అరుణ్ పాడారు. సంగీత ద్వయం లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ఈ పాటను కంపోజ్ చేయగా, ఆనంద్ బక్షి లిరిక్స్ రాశారు.

Also Read: TTD Video: తిరుమలలో భద్రతా లోపం, చక్కర్లు కొడుతున్న ఆనంద నిలయం వీడియో

Exit mobile version