Iconic Air Hostesses : ఓల్డ్ ఈజ్ గోల్డ్.. చీరకట్టులో ఎయిర్ హోస్టెస్‌ల ఆతిథ్యం.. వీడియో వైరల్

Iconic Air Hostesses : మనదేశంలోని విమానాల్లో ఎయిర్‌హోస్టెస్‌లను తొలిసారిగా 1946 సంవత్సరంలో ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టింది.

Published By: HashtagU Telugu Desk
Air Indias Iconic Air Hostess 1960

Air Indias Iconic Air Hostess 1960

Iconic Air Hostesses : మనదేశంలోని విమానాల్లో ఎయిర్‌హోస్టెస్‌లను తొలిసారిగా 1946 సంవత్సరంలో ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టింది. అప్పట్లో ఎయిర్ హోస్టెస్‌లు యూరోపియన్ డ్రెస్‌లు, జాంటీ యాంగిల్ క్యాప్‌లను ధరించేవారు. తొలిసారిగా 1960వ దశకంలో ఎయిర్ హోస్టెస్‌లకు చీరను యూనిఫామ్‌గా ప్రవేశపెట్టారు. ప్రాంతీయ విమాన సర్వీసులతో పాటు విదేశాలకు వెళ్లే విమాన సర్వీసుల్లోనూ చీరకట్టులోనే ఎయిర్ హోస్టెస్‌లు కనిపించేవారు. అంతకుముందు వరకు ఎయిర్ హోస్టెస్ పోస్టులకు విదేశీ మహిళలకు ప్రయారిటీ ఇచ్చేవారు. 1960వ దశకం నుంచి భారతీయ యువతులకు అవకాశం కల్పించే ట్రెండ్ పెరిగింది. ఈ దశకంలో చీరతో పాటు ఘాగ్రా చోలీ ధరించే అవకాశాన్ని కూడా ఎయిర్ హోస్టెస్‌లకు కల్పించేవారు. 1970వ దశకం నాటికి ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్‌లకు చీర అనేది  శాశ్వత దుస్తుల కోడ్‌గా మారిపోయింది. 1960వ దశకం మొదటి నుంచి 1970వ దశకం చివరి వరకు ఎయిర్ హోస్టెస్‌లు కాంజవరం చీరలు, స్మార్ట్ చుడీదార్లు, ఘాఘ్రా చోలీలను ధరించేవారు.

We’re now on WhatsApp. Click to Join

2008 సంవత్సరం నుంచి ఎయిర్ హోస్టెస్‌ల(Iconic Air Hostesses) వస్త్రధారణలో మరోసారి మార్పులు జరుగుతూ వచ్చాయి. ఇండిగో కంపెనీ 2010లో తమ ఎయిర్ హోస్టెస్‌లకు నేటి కాలానికి అనువైన మోడర్న్ యూనిఫామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫ్యాషన్‌ను తదుపరిగా కింగ్‌ఫిషర్, జెట్ ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు కూడా కాపీ కొట్టాయి. 2015లో ఎయిర్ ఇండియా తన క్యాబిన్ సిబ్బందికి మొదటిసారిగా ప్యాంటు ధరించే అవకాశాన్ని అందించడం ప్రారంభించింది. ఇటీవల కాలంలో ప్రారంభమైన ఆకాశ ఎయిర్ లైన్స్ తమ ఎయిర్ హోస్టెస్‌లకు స్నీకర్స్, ప్యాంటును యూనిఫామ్‌గా నిర్ణయించింది. ఏది ఏమైనప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. 1960వ దశకంలో ఎయిర్ ఇండియా విమానాల్లో ఎయిర్ హోస్టెస్‌లు చీరకట్టులో అందించిన సేవలను నేటికీ నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియోను మీరు ఇక్కడ చూడొచ్చు.

Also Read :AP Congress : మరో లిస్ట్ వచ్చేసింది.. 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

  Last Updated: 22 Apr 2024, 02:15 PM IST