Site icon HashtagU Telugu

#BengaluruFloods: బెంగళూరు రోడ్లపై చేపలు వేట

Bgl Fish

Bgl Fish

బెంగళూరులో భారీ వర్షాలు (Bengaluru Floods) తీవ్ర స్థాయిలో దంచికొడుతున్నాయి. యెలహంక మరియు అల్లాలసండ్ర వంటి ప్రాంతాల్లో రోడ్లపై వరద నీటితో పాటు చేపలు (Fish) కొట్టుకొస్తున్నాయి. దీంతో వాటిని పట్టుకునేందుకు స్థానికులు వలలు వేస్తున్నారు. ఇక హెబ్బాల, హెన్నూరు, నాగవార, మరియు ORR వంటి పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. మరోపక్క కర్ణాటక రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ నెల 28 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు అవసరమైతే తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను సూచించింది.

ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ కుప్పకూలింది (Building collapsed). ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఘటనతో పాతభవనాలతో పాటు నిర్మాణం లో ఉన్న భావన ప్రమాణాలను పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Read Also : Kalyani Priyadarshan Wedding : కళ్యాణి ఇలాంటి పని చేసిందేంటి..ఫ్యాన్స్ షాక్