Site icon HashtagU Telugu

Fight for Mangos : లండన్‌లో మామిడి పండ్ల కోసం.. ఓ రేంజ్‌లో కొట్టుకున్నారు..

Fight For Mangoes in London by some Pakistan people

Fight For Mangoes in London by some Pakistan people

మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో నీళ్ల ట్యాంకుల దగ్గర గొడవలు పడటం చూశాం. బాగా తక్కువ రేటుకి ఏదైనా వస్తువు దొరుకుతుంది అంటే షాప్స్ దగ్గర గొడవ పడటం కూడా చూశాం. కానీ ఇతర దేశాల్లో కూడా ఇలాంటి గొడవలు జరుగుతాయని మీరు అనుకుంటున్నారా. అబ్బే ఆ దేశాలు చాలా పద్ధతైన దేశాలండి, గొడవైంది అనగానే పోలీసులు(Police) వచ్చేస్తారట కదా అని మనం అనుకుంటాం.

కానీ అలా పోలీసులు వచ్చేలోపే మరీ జుట్టు, జుట్టు పట్టుకొని కాకపోయినా ఓ రేంజ్ లో జరిగిన గొడవ ఇప్పుడు ట్విట్టర్(Twitter) లో వైరల్ అయ్యింది. ఇంతకీ ఈ గొడవ ఎక్కడ అయ్యిందో తెలుసా.. లండన్(London) లో. వాళ్ళు కొట్టుకున్నది మామిడి పళ్ళ కోసం. ఎండాకాలం వచ్చిందంటే మామిడిపండ్లకు ఉన్న డిమాండ్ వేరు. మన మామిడి పండ్లకు విదేశాల్లో మంచి గిరాకీ. చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరం మామిడిపండు తింటాం.

మనదేశంలో అయితే మామిడిపళ్లు(Mangos) విరివిగా దొరుకుతాయి కాబట్టి పర్వాలేదు. కానీ ఇతర దేశాల్లో మామిళ్ళ మామిడిపండ్ల కోసం జనం మొహం వాచిపోతారు. కాస్త మంచి రకం మామిడిపళ్లు కనపడితే చాలు వాటిని కొనడానికి ఎగబడతారు. అచ్చంగా మామిడి పండ్ల కోసమే లండన్లోని ఓ గ్రోసరి స్టోర్ లో గొడవ జరిగింది. కొంతమంది పాకిస్తానీలు మామిడి పండ్లను చేజిక్కించుకునేందుకు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. చేతికి అందిన వస్తువులతో కొట్టుకునే ప్రయత్నం చేశారు. గొడవకు దిగిన వారిలో ఓ మహిళ కూడా ఉంది. షాప్ దగ్గర నేల తడిగా ఉండడంతో ఓ వ్యక్తి అమాంతం కింద పడిపోయాడు కూడా. అయినా సరే ఆగకుండా గొడవ పడుతూనే ఉన్నారు. చివరికి ఎలా ముగిసిందో తెలియదు కాని మొత్తానికి మామిడి పళ్ళ కోసం కొట్టుకుంటున్న ఈ వీడియో మాత్రం వైరల్ అయ్యింది.

 

Also Read : Viral: రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు, వీడియో వైరల్