Site icon HashtagU Telugu

Two Women Married : భర్తల టార్చర్.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు

Two Women Married In Uttar Pradesh Gorakhpur Deoria Abusive Alcoholic Husbands

Two Women Married : తమ భర్తలు బాగా మద్యం తాగొచ్చి టార్చర్ చేయడాన్ని ఆ ఇద్దరు మహిళలు తట్టుకోలేకపోయారు. వారితో విసిగి వేసారిపోయారు. చివరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

Also Read :YSRCP Vs BJP : వైసీపీ నుంచి మెజార్టీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి వెళ్తారా? ఏం జరగబోతోంది ?

తాళిబొట్లు కట్టుకొని..

ఉత్తరప్రదేశ్‌లో గత  గురువారం సాయంత్రం వింత ఘటన జరిగింది. గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన కవిత, గుంజ అలియాస్ బబ్లూ అనే ఇద్దరు మహిళలు ఇంటి నుంచి పారిపోయారు. దేవరియా జిల్లాలో ఛోటీ కాశీగా పేరొందిన శివాలయం వేదికగా పెళ్లి చేసుకున్నారు. ఈక్రమంలో కవిత మెడలో గుంజ తాళిబొట్టును కట్టింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read :Foreign Aid Freeze : ఉక్రెయిన్‌కు ట్రంప్ షాక్.. రష్యాకు ఊరటనిచ్చే సంచలన నిర్ణయం

వరుడిగా మారింది ఎవరో తెలుసా ?

కవిత, గుంజ అలియాస్ బబ్లూ(Two Women Married).. ఈ ఇద్దరు ఆరేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయమయ్యారు. ఆ సమయంలో ఇద్దరికీ పెళ్లి జరగలేదు. పెళ్లయ్యాక ఈ ఇద్దరూ తాగుబోతు భర్తల వల్ల వేధింపులకు గురయ్యారు. ఇళ్లలో హింసను, వేధింపులను అనుభవించారు. ఈ అంశంపై వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చర్చించుకున్నారు. తాగుబోతు భర్తల నుంచి విముక్తి పొందాలని నిర్ణయించుకున్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారం గురువారం సాయంత్రం దేవరియా జిల్లాలోని ఛోటీ కాశీ శివాలయానికి చేరుకున్నారు. అక్కడ గుంజ అలియాస్ బబ్లూ వరుడి పాత్రను పోషించింది. కవిత వధువు పాత్రను పోషించింది. కవిత నుదుటిపై గుంజ సింధూరం పెట్టి, పూల మాల వేసింది. ఇద్దరూ కలిసి ఒకరి వెంట మరొకరు ఏడు అడుగులు వేశారు.

వాళ్లిద్దరూ ఏమన్నారంటే.. ?

‘‘భర్తలు మమ్మల్ని అవమానించారు. అనుమానించారు. వేధించారు. అలాంటి వాళ్లతో కలిసి ఉండటం కుదరదు. అందుకే మేం ఇద్దరం కలిసి పెళ్లి  చేసుకున్నాం’’ అని కవిత, గుంజ చెప్పుకొచ్చారు. గోరఖ్‌పూర్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని కలిసి జీవిస్తామని, ప్రశాంతంగా బతుకుతామని వారు ప్రకటించారు.