Site icon HashtagU Telugu

Bengaluru Metro : బట్టలు బాగోలేవంటూ రైతును మెట్రో ఎక్కనివ్వని అధికారులు..

Farmer Denied Entry In Beng

Farmer Denied Entry In Beng

సమాజం ఎటు వెళ్తుందో అర్ధం కావడం లేదు..మనుషులు రోజు రోజుకు దారుణంగా ..అసలు ఏమాత్రం జాలి , దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎంతసేపు వేసుకొని బట్టలు , మాట్లాడే తీరు, ఉండే హోదానే చూస్తున్నారు తప్ప వారిలో కష్టాన్ని చూడడం లేదు. ముఖ్యంగా వారు వేసుకొనే బట్టలు చూసి దారుణంగా వ్యవహరిస్తున్నారు. బట్టలు మురికిగా ఉన్నారని హోటల్స్ లోకిని అనుమతించకపోవడం…దూరం ఉండి మాట్లాడడం..అసలు చూసి చూడనట్లు ఉండడం చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా బెంగుళూర్ (Bengaluru ) లో నగరంలో కూడా ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. మురికి బట్టలు వేసుకొని మెట్రో స్టేషన్ కు వచ్చిన ఓ రైతు ను మెట్రో (Metro) ఎక్కకుండా అడ్డుకున్న ఘటన ఇప్పుడు సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

తెల్లటి చొక్కా ధరించి, తలపై బట్టల సంచితో ఉన్న ఓ రైతు బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో తన ప్రయాణానికి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు.. తీరా వ‌స్తువులు త‌నిఖీ చేస్తుండ‌గా సెక్యూరిటీ సిబ్బంది రైతును ఆపాడు. లోనికి వెళ్ళొదంటూ అడ్డుకున్నాడు. మరో ప్ర‌యాణికుడు ఆ రైతుకు మద్దతుగా నిలిచాడు. మెట్రో సేవలు పొందాలంటే కస్టమర్లు తప్పనిసరిగా డ్రెస్‌ కోడ్‌ను పాటించాలని నిబంధన ఏమైనా ఉందా అని ఆయన మెట్రో అధికారులను ప్రశ్నించారు. మురికి బట్టలు వేసుకొని ట్రైన్ ఎక్కితే మిగతా ప్రయాణికులు ఆందోళన చేస్తారని సదరు సిక్యూర్టీ చెప్పగా..మెట్రో కేవలం ధనికులకే అని ఏమైనా రాసి ఉందా..రాసి ఉంటె చూపించండి అంటూ ప్రశ్నించగా..దానిని సదరు సెక్యూర్టీ ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన అధికారులు సదరు రైతును లోనికి అనుమతించారు. దీనికి సంబదించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ఘటన ఫై బెంగుళూర్ మెట్రో స్పందిస్తూ..బాధ్యుడైన ఆ సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను తొలగించిన‌ట్లు తెలిపింది.

Read Also : Pawan Kalyan Properties : ఎన్నికల కోసం సొంత ఆస్తులు అమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్..?