Site icon HashtagU Telugu

Beating With Slipper: మోకాళ్లపై కూర్చోబెట్టి, చెప్పుతో కొట్టి పనిష్మెంట్.. మాజీ సీఎం కూతురి నిర్వాకం

Ex Assam Cms Daughter Beating Drive With Slipper Prajoyeeta Kashyap Prafulla Kumar Mahanta 

Beating With Slipper: మాజీ సీఎం కుమార్తె రెచ్చిపోయింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది. తమ వద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తిని మోకాళ్లపై కూర్చోబెట్టి మరీ అత్యంత దారుణంగా చెప్పుతో చెంపదెబ్బలు కొట్టింది.

Also Read :Producer Kedar Suicide : నాడు శ్రీదేవి.. నేడు కేదార్.. దుబాయ్‌లో ఫిబ్రవరిలోనే మిస్టరీ మరణాలు

దారుణ పనిష్మెంట్

ఈ రకంగా డ్రైవరుకు పనిష్మెంట్ ఇచ్చింది మరెవరో కాదు.. అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్‌ మహంత  కుమార్తె ప్రజోయితా కాశ్యప్(Beating With Slipper). ఇంతకీ డ్రైవరును ఇంత దారుణంగా ఆమె ఎందుకు కొట్టింది.. అనుకుంటున్నారా ? మద్యం మత్తులో తనను ఏదో మాట అన్నాడనే అక్కసుతో ప్రజోయితా కాశ్యప్‌ రగిలిపోయింది. కోపంతో ఊగిపోయిన ఆమె తమ భద్రతా సిబ్బందికి కీలక ఆదేశం ఇచ్చింది. తనను మాట అన్న ఆ డ్రైవరును మోకాళ్లపై కూర్చోబెట్టమని చెప్పింది. వాళ్లు అతడిని పిలిపించి, ఇంటి ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టారు. అనంతరం కోపంతో ఇంటి నుంచి బయటికి వచ్చిన ప్రజోయితా కాశ్యప్ తన చెప్పును తీసి, ఆ డ్రైవరు చెంపలు వాయించింది.

Also Read :Powerful Sister: అమెరికా కాచుకో.. ఎంతకైనా తెగిస్తాం.. కిమ్ సోదరి వార్నింగ్

నెటిజన్లు ఫైర్

ఈ అమానుష ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరైనా, ఏదైనా తప్పు చేస్తే పోలీసులకు కంప్లయింట్ ఇవ్వొచ్చు. చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఏదో ఒక మాట అన్నందుకు మరీ ఇంత దారుణంగా కొడతారా ? అందరి ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి చెప్పుతో కొట్టడం దారుణం అంటూ నెటిజన్లు నానా రకాలుగా స్పందిస్తున్నారు. మాజీ సీఎం కూతురు అయినంత మాత్రాన ప్రజోయితకు కొమ్ములేం ఉండవని పలువురు నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ప్రభుత్వ ఎమ్మెల్యే క్వార్టర్లలో ఇంత దారుణం జరిగినా పోలీసులు స్పందించకపోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. న్యాయం అనేది ప్రజాప్రతినిధులకైనా, ప్రజలకైనా ఒకేలా ఉండాలని పలువురు వాదిస్తున్నారు.వెంటనే పోలీసులు స్పందించి మాజీ సీఎం కుమార్తె ప్రజోయితపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  రెండుసార్లు అస్సాంకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రఫుల్లకుమార్ మహంత కూడా దీనిపై స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు. ప్రఫుల్లకుమార్ మహంత ప్రస్తుతం  ఎమ్మెల్యేగా లేరు. అయినా ఆయన కుటుంబం ఎమ్మెల్యే క్వార్టర్లలో ఉండేందుకు అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్రంలోని ఇదే బీజేపీ సర్కారు గతంలో బలవంతంగా రాహుల్ గాంధీని ప్రభుత్వ క్వార్టర్ ఖాళీ చేయించింది.