Employee Theft : అతడి శాలరీ కేవలం రూ.13వేలు. అయితేనేం లగ్జరీగా ఉండే BMW కారు, BMW బైక్‌లు కొన్నాడు. అంతటితో ఆగకుండా 4 బీహెచ్‌కే బెడ్‌రూమ్స్ ఉండే ఫ్లాట్‌ను కొనేశాడు. దాన్ని తన గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్టుగా ఇచ్చాడు. తదుపరిగా మరింత భారీ ఖర్చులు చేశాడు. ఒక నగల దుకాణానికి వెళ్లి వజ్రాలు పొదిగిన గాజులను కొనేశాడు. కేవలం 13వేల రూపాయల శాలరీ కలిగిన వ్యక్తి ఈ ఖర్చులన్నీ ఎలా చేశాడు ? అసలేం జరిగింది అనేది తెలియాలంటే ఈవార్తను చదవాల్సిందే.
Also Read :Tsunami 20 Years : 20 ఏళ్ల క్రితం ఏపీని వణికించిన సునామీ.. 14 దేశాలకు వణుకు
చిరుద్యోగి లగ్జరీ లైఫ్ వెనుక స్కాం..
- అతడి పేరు హర్ష కుమార్ అనిల్ క్షీరసాగర్ (Harsh Kumar Anil Kshirsagar).
- హర్ష కుమార్(Employee Theft) మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నెలకు రూ.13,000 జీతంతో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
- హర్ష్ కుమార్ తనకు తెలిసిన మరో వ్యక్తితో కలిసి ప్రభుత్వానికి చెందిన రూ.21 కోట్ల 59 లక్షల 38 వేలను కాజేశాడు. ఈ ఇద్దరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఛత్రపతి శంభాజీనగర్‌లోని డిపార్ట్‌మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన డబ్బులను స్వాహా చేశారు.
- ఆ డబ్బులతో లగ్జరీగా బతకడం మొదలుపెట్టారు. వారిని చూసి అందరూ అవాక్కయ్యారు. ఇంత తక్కువ శాలరీతో అంత భారీ లగ్జరీ ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయారు.
- బైక్‌పై ఆఫీసుకు వచ్చే హర్ష కుమార్.. ఏకంగా కారులో తిరగడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు కొన్న కారు ధర రూ.35 లక్షలు.
- ఈ స్కాం బయటపడిన తర్వాత హర్ష కుమార్ పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. అతడి కోసం ప్రస్తుతం పోలీసు టీమ్స్ గాలిస్తున్నాయి.
- ప్రభుత్వ నిధులను నిల్వ చేసేందుకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో ఇండియన్ బ్యాంక్‌లో తెరిచిన ఖాతా నుంచి డబ్బులను హర్ష కుమార్ కాజేశాడని దర్యాప్తులో గుర్తించారు.
- ఈ బ్యాంకు అకౌంటు ద్వారా లావాదేవీలు చేసేందుకు డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సంతకం చేసిన చెక్కులు కావాలి.
- డిపార్ట్‌మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా హర్ష్‌కుమార్ క్షీరసాగర్, యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్ పనిచేసేవారు. వీరంతా కలిసి బ్యాంకుకు ఫేక్ పత్రాలను సమర్పించి డబ్బులను డ్రా చేశారని విచారణలో తేలింది.
- నకిలీ పత్రాలను బ్యాంకుకు సమర్పించి వాటితో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను యాక్టివేట్ చేసి.. తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నిధులను బదిలీ చేయించుకున్నారు.
- ఈ లావాదేవీలు జరిగిన ఆరు నెలల తర్వాత వ్యవహారం వెలుగుచూసింది.