Elon Musk Firing : ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త పని చేస్తుంటారు. తన ప్రతీ యాక్టివిటీని సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేస్తుంటారు. ఈసారి ఎలాన్ మస్క్ ‘బారెట్ 50 క్యాలిబర్ స్నైపర్ రైఫిల్’తో ఫైరింగ్ చేసి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఫోకస్డ్ గా రైఫిల్ ను చేతపట్టి.. రెచ్చిపోయి కాల్పులు జరుపుతుండటాన్ని మనం వీడియోలో చూడొచ్చు. ఇవాళ ఉదయం 6 గంటలకు ఆయన ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 26 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఎలాన్ మస్క్.. ‘‘హిప్-ఫైరింగ్ మై బారెట్ 50 కాల్’’ అని టైటిల్ పెట్టారు.
Also read : Khammam : ఖమ్మంలో టెన్షన్.. టెన్షన్.. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నందమూరి అభిమానుల ముందస్తు అరెస్ట్‌లు
అంతకుముందు 2022 నవంబర్ లో కూడా ఎలాన్ మస్క్ రెండు పిస్టల్స్ తో పాటు పలు కూల్ డ్రింక్స్ తో కూడిన ఒక ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దానికి ‘‘మై బెడ్‌సైడ్ టేబుల్’’ అనే క్యాప్షన్ పెట్టారు. 2022 మేలో ఎలాన్ మస్క్ ఒక పోస్ట్ చేస్తూ.. ‘‘అమెరికాలో అసాల్ట్ రైఫిల్స్ వాడటానికి ప్రత్యేక దర్యాప్తు తర్వాతే అనుమతి ఇవ్వాలి. అవన్నీ జరిగాకే వాటికి లైసెన్స్ ఇవ్వాలి. లేదంటే దుర్వినియోగం చేసే ముప్పు ఉంది’’ అని తెలిపారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 19 మంది చిన్నారులు సహా 21 మంది చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆయన చేసిన ఈ పోస్ట్ అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. టెక్సాస్ ఘటన తర్వాతే.. తుపాకీ చట్టాలను మార్చాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా (Elon Musk Firing) నిర్ణయించారు.
Hip-firing my Barrett 50 cal pic.twitter.com/OkNnjWid0r
— Elon Musk (@elonmusk) September 30, 2023
