Elephant Hunts: పులిని తరిమివేసిన ఏనుగు.. నెట్టింట్లో వీడియో వైరల్

సాధారణంగా ఇతరు జంతువులను పులి వేటాడుతుంది. కానీ ఇక్కడ ఏనుగే పులిని వేటాడింది.

Published By: HashtagU Telugu Desk
Elephant

Elephant

వివిధ జంతువులకు నిలయంగా మారే అడవి (Forest)లో అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. అనేక రకాల జంతువులు తమ చేష్టలతో ఆశ్చర్యపరుస్తుంటాయి. సాధారణంగా ఏ జంతువుకైనా పులి కనిపిస్తే నిమిషం ఆలోచించకుండా వెంటనే పరుగులు తీస్తుంది. అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంటాయి. ఈ వీడియో లో మాత్రం పులి (Tiger)నే తరిమివేసింది ఓ జంతువు. ఆ జంతువు సింహమో, ఇంకేదో కాదు.. ఓ ఏనుగు.

అడవిలో వేటకుకువెళ్లిందో, లేదా బాగా అలసిపోయిందేమో కానీ దాహం తీర్చుకోవడానికి ఓ సరస్సు వద్దకు వస్తుంది పులి. అదే సమయంలో ఏనుగు (Elephant) అక్కడే ఉంటుంది. నీళ్లు తాగడానికి వచ్చిన పులి నెమ్మదిగా అడుగులు వేస్తు వస్తోంది. పులిని గమనించిన ఏనుగు పరుగులు తీస్తూ  తరిమివేస్తుంది. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది. పులిని వెంటాడిన ఏనుగే అడవికి రాజు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

FS అధికారి సుశాంత నంద తన వ్యక్తిగత ట్విట్టర్ లో వన్యప్రాణులకు సంబంధించిన పోస్ట్‌లను క్రమం తప్పకుండా షేర్ చేస్తుంటారు. వివిధ జాతుల జంతువుల మధ్య ఘర్షణ (Fighting) ను చూపించే వీడియోల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటాడు. అతని ట్వీట్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. పులిని తరిమివేసే ఏనుగు వీడియో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

Also Read: Prabhas Fans: ఆదిపురుష్ కు నెగిటివ్ రివ్యూ.. యువకుడిని చితకబాదిన ప్రభాస్ ఫ్యాన్స్!

  Last Updated: 16 Jun 2023, 04:18 PM IST