Site icon HashtagU Telugu

Cow Dung : కాలేజీ గోడలకు ఆవుపేడ పూసిన ప్రిన్సిపల్..ఎందుకంటే

Cow Dung

Cow Dung

ఢిల్లీ యూనివర్సిటీ(Delhi College Principal)కి చెందిన లక్ష్మీబాయి (Laxmibai ) కాలేజీలో ప్రిన్సిపల్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కాలేజీ ప్రిన్సిపాల్ డా. ప్రత్యూష్ వత్సల (Pratyush Vatsala) స్వయంగా ఆవుపేడ(Cow Dung)ను తీసుకుని, క్లాస్‌రూమ్ గోడలకు పూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆమె ట్రైనింగ్ షూస్ వేసుకొని, పచ్చటి చీరలో కనిపిస్తూ గోడలపై సున్నితంగా ఆవుపేడను పూస్తున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Telangana : త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులు భర్తీ: సజ్జనార్

దీనిపై ఆమె మాట్లాడుతూ.. వేసవిలో గదులను సహజంగా చల్లగా ఉంచేందుకు చేపట్టిన పరిశోధనలో ఇది భాగమని తెలిపారు. “ఇది పోర్టా కాబిన్లలో జరుగుతున్న ప్రయోగం. ప్రకృతితో అనుసంధానమవుతూ గదులను చల్లగా ఉంచే మార్గాలను పరీక్షిస్తున్నాం. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు మరో వారం రోజుల్లో వెల్లడిస్తాను” అని ఆమె పేర్కొన్నారు.

ఈ ప్రయోగం ‘సీ’ బ్లాక్‌లోని కొన్ని గదుల్లోనే ప్రస్తుతం జరుగుతోంది. “ఇక్కడ తరగతులు నిర్వహించేవారికి కొత్త పరిజ్ఞానం, భిన్నమైన అనుభవం కలుగుతుంది” అని ఆమె టీచర్స్ గ్రూప్‌లో సందేశం పంపినట్టు తెలుస్తోంది. అయితే ఈ చర్యపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ప్రశంసించగా, మరికొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.