Drunken Brawl: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో మద్యం మత్తులో ఓ యువతి పెద్ద రచ్చ చేసింది. ఆదివారం రాత్రి కోర్బాలోని పాష్ పామ్ మాల్ దగ్గర ఉన్న ఓఎన్‌సీ బార్ వెలుపల ఈ ఘటన జరిగింది. రాత్రి ఆలస్యంగా బార్ నుంచి బయటకు వచ్చిన యువకులు, యువతుల గ్రూప్ బహిరంగ ప్రదేశంలో గొడవకు దిగారు. మాటామాటా పెరిగి ఓ దశలో ఒక్కరిపై ఒక్కరు దాడికి కూడా యత్నించారు. దీంతో అప్రతిష్ట కలిగేలా మారిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఆ యువతులు, యువకులు మద్యం తాగిన తర్వాత బయటకు వచ్చి అల్లరి మొదలుపెట్టారు. బహిరంగ ప్రదేశంలో గొడవ పడుతూ, శబ్దం చేయడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అక్కడున్న కొంతమంది తమ మొబైల్ ఫోన్లతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి ఇప్పుడు వైరల్ అయ్యాయి. వీడియోలో కనిపించిన దృశ్యాలు చూస్తే… ఆ యువతులు, యువకులు చాలా దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించడం స్పష్టంగా కనిపిస్తుంది.
గొడవపై సమాచారం అందుకున్న కోర్బా పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమాధానం చేయాలని ప్రయత్నించారు. కానీ, మద్యం మత్తులో ఉన్న యువతి పోలీసులతోనే గొడవపడింది. అసభ్య పదజాలం వినిపించడంతో పోలీసులు బెంబేలెత్తిపోయారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా మిగిలిన వారిపై కూడా చర్యలు తీసుకోనున్నారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి రచ్చలు జరిగితే కుటుంబాలు బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నామని వాపోతున్నారు. అధికారులపై నిఘా పెంచాలని, ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Raod Crack : చెన్నైలో ఒక్కసారిగా చీలిన రోడ్డు.. భయాందోళనలో ప్రజలు