దేశంలో రోజు రోజుకు వివాహేతర సంబంధాల (Illegal Relationship) సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ సంబంధాల కారణంగా హత్యలు కూడా అదే రీతిలో పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తలను , కన్న బిడ్డలను సైతం హతమారుస్తున్నారు. భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడం, లేదా భర్త ప్రియురాలితో కలిసి భార్యను హత్య చేయడం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ ఆష్లే మాడిసన్ (Yahan hai Ashley Madison) 2025 జూన్ నెలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఇందులో వివాహేతర సంబంధాల కోసం ఈ యాప్‌ను ఎక్కువగా వాడే భారతీయ జిల్లాల జాబితాను వెల్లడించింది.
Ola S1 Sales: ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ వద్దంటున్న కస్టమర్లు.. ఎందుకంటే?
ఈ నివేదిక ప్రకారం.. తమిళనాడులోని కాంచీపురం జిల్లా టాప్ స్థానంలో నిలిచింది. గత ఏడాది 17వ స్థానంలో ఉన్న ఈ జిల్లా ఒక్క సంవత్సరం వ్యవధిలోనే మొదటి స్థానానికి చేరుకోవడం గమనార్హం. రెండవ స్థానంలో ఢిల్లీ, మూడవ స్థానంలో గుర్గావ్ ఉంది. ఆశ్చర్యకరంగా ముంబై ఈసారి టాప్ 20లో స్థానం దక్కించుకోలేకపోయింది, గతేడాది ముంబై టాప్ 2లో ఉండేది. మరోవైపు హైదరాబాద్ 18వ స్థానంలో ఉండగా, బెంగళూరు, పుణే, లక్నో, కోల్‌కతా వంటి ఇతర నగరాలు కూడా టాప్ 20లో ఉన్నాయి.
ఆష్లే మాడిసన్ అనేది వివాహితులు లేదా పార్టనర్‌తో ఉన్నవారు తమకు వెలుపల సంబంధాలను ఏర్పరచుకునే ఉద్దేశంతో వాడే డేటింగ్ ప్లాట్‌ఫారమ్. 2002లో కెనడాలో ప్రారంభమైన ఈ వెబ్‌సైట్ ప్రపంచవ్యాప్తంగా వివాహేతర సంబంధాల కోసం పేరుగాంచింది. ఈ యాప్ వినియోగదారుల గోప్యతను అత్యంత రహస్యంగా నిలబెట్టే విధానంతో పనిచేస్తోంది. ఈ కారణంగా ఇప్పటి వరకు అనేక దేశాల్లో విస్తృతంగా వాడబడుతోంది.
Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం
ఆష్లే మాడిసన్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పాల్ కీబుల్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఆధునిక జీవనశైలి, వ్యక్తిగత స్వేచ్ఛపై దృష్టి పెరుగుతోందని, దీనివల్ల సంబంధాల నిర్వచనంలో మార్పులు వస్తున్నాయన్నారు. వారి సర్వే ప్రకారం, పెద్దలలో సగానికి పైగా వ్యక్తులు వివాహేతర సంబంధాలను సమాజంలో సహజంగానే స్వీకరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం భారతదేశం ఆష్లే మాడిసన్ వినియోగంలో ప్రపంచంలో ఆరో స్థానంలో ఉందని, ఈ సంవత్సరాంతంలో ఈ స్థానం మరింత మెరుగయ్యే అవకాశముందన్నారు.
ఈ సర్వే ప్రకారం టాప్ 20 లో ఉన్న రాష్ట్రాలు చూస్తే..
1. Kanchipuram
2. Central Delhi
3. Gurgaon
4. Gautam Buddha Nagar
5. South West Delhi
6. Dehradun
7. East Delhi
8. Pune
9. Bangalore
10. South Delhi
11. Chandigarh
12. Lucknow
13. Kolkata
14. West Delhi
15. Kamrup
16. North West Delhi
17. Raigarh
18. Hyderabad
19. Ghaziabad
20. Jaipur