Delhi Lovers: రోడ్డు పై రెచ్చిపోయిన ప్రేమజంట, దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు

బైక్‌ను నడుపుతున్నప్పుడు ప్రేమ జంట ముద్దులు పెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించారు.

Published By: HashtagU Telugu Desk
Lovers riding on bike

Lovers

ఢిల్లీలోని మంగోల్‌పురి సమీపంలో ఒక జంట బహిరంగంగా ప్రేమను ప్రదర్శించే వీడియో  వైరల్ కావడంతో, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు.  రూ.11,000 జరిమానా విధించారు. కదులుతున్న బైక్‌ను నడుపుతున్నప్పుడు ప్రేమ జంట ముద్దులు పెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఇది ఘజియాబాద్ పోలీసుల దృష్టికి వెళ్లింది.

ఈ వీడియో జూలై 16న ట్విట్టర్‌లో షేర్ చేయబడ్డాయి, ఒక వ్యక్తి ముందు కూర్చున్న మహిళతో బైక్ నడుపుతూ, గట్టిగా కౌగిలించుకున్నాడు. అబ్బాయి హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ నిబంధనలను బ్రేక్ చేశాడు. దీంతో “ద్విచక్ర వాహనాన్ని ప్రమాదకరంగా నడుపుతున్న వైరల్ వీడియోను గుర్తించి @dtptraffic నిందితుడిపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మొత్తం రూ. 11,000 జరిమానా విధించబడింది. దయచేసి సినిమాలను కాపీ చేయవద్దు. సురక్షితంగా  వాహనాలను నడపండి. సురక్షితంగా ఉండండి” అంటూ ఢిల్లీ పోలీసులు గురువారం ట్విట్టర్‌లో రాశారు. అయితే గతకొంతకాలంగా దేశంలో ఇలాంటి కేసులు నమోదు అవుతుండటంతో పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Rajani: రాష్ట్ర గిడ్డంగుల చైర్‌ప‌ర్స‌న్‌గా ర‌జ‌ని పదవీ బాధ్యతల స్వీకరణ

  Last Updated: 20 Jul 2023, 03:33 PM IST