Site icon HashtagU Telugu

Dead Body : అంత్యక్రియలకు అంత సిద్ధం కాగా.. ఒక్కసారిగా లేచి కూర్చున్న శవం..!!

Fire in Meerut

Dead Body

ప్రపంచంలో ప్రతి రోజు అనేక వింతలు , విశేషాలు , నమ్మలేని సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. అవి చూసి..తెలుసుకొని ఇలా కూడా జరుగుతాయా..? అని అనుకుంటుంటాం..వీటిలో చనిపోయిన వారు లేవడం. చనిపోయిన వ్యక్తులు సడెన్ గా లేవడం..మాట్లాడడం వంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు కాస్త భయం తో పాటు ఆశ్చర్యం వేస్తుంటుంది. తాజాగా హర్యానాలో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని హాస్పటల్ నుండి ఇంటికి తీసుకెళ్తుండగా..సడెన్ లేచి కూర్చున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు కాస్త షాక్ తో ఆశ్చర్యానికి గురయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

దర్శన్‌ సింగ్‌(80) అనే వ్యక్తి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడం తో కుటుంబ సభ్యులు హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు వారంరోజులుగా ఐసీయూలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని వైద్యులు కుటుంబ సభ్యులతో చెప్పడం తో.. బంధువులు గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఆసుపత్రి నుంచి శవాన్ని అంబులెన్సులో గ్రామానికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో అంబులెన్సు ఓ గుంతలో పడింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మరణించిన దర్శన్‌సింగ్‌లో లేచి కూర్చున్నాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం అందించి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు మరోసారి చికిత్స అందిస్తున్నారు. అసలు ఇలా ఎలా జరిగిందని డాక్టర్స్ సైతం షాక్ కు లోనయ్యారు.

Read Also : Virat Kohli: కోహ్లీపై షాకింగ్ కామెంట్స్.. విరాట్ ఎవరో నాకు తెలియదు: రొనాల్డో