భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో చోటుచేసుకున్న ఘటన ఆ ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వాసవీనగర్‌కు చెందిన సుగ్గుల కార్తీక్ డిగ్రీ పూర్తి చేసి, డేటింగ్ యాప్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకుని ప్రేమలో పడ్డాడు. ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్తుందని భావించిన కార్తీక్, ఆమెతో మరింత అనుబంధాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె అతడి ప్రేమను తిరస్కరించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
Chhattisgarh : దంతేవాడా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ .. ఐదుగురు మావోలు మృతి
ప్రేమలో ఎదురైన నిరాకరణను తట్టుకోలేక కార్తీక్ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, తండ్రి సుదర్శన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువతీ యువకుల మధ్య ఏర్పడే పరిచయాలు, భావోద్వేగాలు కొన్నిసార్లు ఊహించని మార్గంలో ముగియడం మన సమాజంలో తరచూ కనిపించే విషయం. కానీ ఈ ఘటన మరోసారి డేటింగ్ యాప్(Dating App)ల ప్రభావంపై చర్చకు దారితీసింది.
నేటి యువత భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో, ప్రేమ విఫలాన్ని జీర్ణించుకోవడం లో ఇబ్బంది పడుతున్నారు. ప్రేమ అనే భావనను ఆరోగ్యంగా అర్థం చేసుకోవడం, నిరాకరణను సహజంగా స్వీకరించగలగడం అత్యంత అవసరం. ఒకరి జీవితంలో నిరాకరణ వచ్చినప్పుడు, దాన్ని అధిగమించేలా మనసును ధృఢంగా ఉంచుకోవాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సమాజం యువతకు మార్గదర్శకత్వం కల్పించాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.