Site icon HashtagU Telugu

Vote Chori : ‘ఓట్ చోరీ’ పై కాంగ్రెస్ వీడియో వైరల్

Vote Chori Video

Vote Chori Video

‘ఓట్ చోరీ’ (Vote Chori) అనే అంశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ (INC) పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు ఖైదీలు జైలులో మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న ఒక యానిమేటెడ్ వీడియోను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ద్వారా కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీని ప్రధాన అంశంగా ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

Baba Vanga : నవంబర్‌లో భూమిపైకి రానున్న గ్రహాంతరవాసులు.. బాబా వంగా షాకింగ్ అంచనాలు

వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు ఖైదీలు మాట్లాడుకుంటూ “మనకంటే పెద్ద దొంగలు వచ్చారన్నా.. అధికారం వాళ్ల చేతుల్లోనే ఉంది కదా ఇప్పటివరకు ఎవరూ వారిని పట్టుకోలేదు” అని అంటారు. దానికి మరొకరు “అసలు వాళ్ళు చేస్తున్న దొంగతనం ఏంటో తెలుసా? ఓట్ల చోరీ” అని బదులిస్తారు. ఈ వీడియో ద్వారా అధికారంలో ఉన్నవారు ఓట్లను ఎలా దొంగిలిస్తున్నారో వ్యంగ్యంగా చూపిస్తోంది. దీనికి అనుబంధంగా ‘మీ ఓటు చోరీ.. మీ హక్కు చోరీ’ అనే నినాదాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది.

ఈ వీడియో విడుదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ వీడియో ద్వారా అధికార పక్షంపై నేరుగా విమర్శలు సంధించింది. ఓట్ల చోరీ అనేది ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమో ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే, ఈ ఆరోపణలపై అధికార పక్షం ఇంకా స్పందించలేదు.