Diners Urinated: అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. అందుకే మన భారతీయులు ఆహార పదార్థాలకు తగిన గౌరవం ఇస్తారు. కానీ చైనాలో కుక్కల నుంచి నక్కల దాకా, పందికొక్కుల నుంచి పాముల దాకా, ముంగిసీల నుంచి కప్పల దాకా అన్నీ తినేస్తుంటారు. ఏది తినాలి ? ఏది తినొద్దు ? అనే సెన్స్ చైనీయుల్లో చనిపోయింది. తాజాగా చైనాలో ఘోరం జరిగింది. ఒక రెస్టారెంటులోని డైనింగ్ టేబుల్‌పై ఉంచిన హాట్‌పాట్‌లోకి ఇద్దరు యువకులు అందరూ చూస్తుండగా మూత్రం పోశారు. వివరాలివీ..
Also Read :YV Vikrant Reddy : వైవీ విక్రాంత్‌రెడ్డి ఎవరు ? ఆయనపై అభియోగాలు ఏమిటి ?
ప్రతీ డైనింగ్ బెంచీ మధ్యలో హాట్ పాట్
పైన మనం చెప్పుకున్న దారుణ ఘటన చైనాలోని షాంఘై పరిధిలో ఉన్న హైడిలావ్ రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. ఈ రెస్టారెంట్ హాట్ పాట్‌లకు ఫేమస్. హాట్ పాట్ అంటే.. ప్రతీ డైనింగ్ బెంచీ మధ్యలో ఒక హాట్ పాట్ ( వివిధ అరలు కలిగిన కూర పాత్ర) ఉంటుంది. ఇందులో వివిధ కూరలు (కర్రీలు) ఉంటాయి. హాట్ పాట్‌లోని కర్రీలు ఎప్పటికీ వేడిగా ఉండేలా, దాని కింది భాగంలో వేడిని కలిగించే ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఇద్దరు యువకులు డైనింగ్ బెంచీపై నిలబడి మరీ ఈ హాట్‌పాట్‌లో మూత్రం పోశారు. ఈ ఘటన విషయం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించి 17 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు మద్యం మత్తులోనే హాట్ పాట్‌లో మూత్రం పోశారని పోలీసు విచారణలో వెల్లడైంది.
Also Read :Alcohol Addiction: తాగుబోతులుగా మారిన భార్యలు.. భర్తల ఫిర్యాదు
చెల్లించిన మొత్తానికి పదింతల నగదు
ఈనేపథ్యంలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 8 వరకు తమ రెస్టారెంట్‌కు వచ్చిన దాదాపు 4 వేల మంది కస్టమర్లు అందరికీ హైడిలావ్ నిర్వాహకులు క్షమాపణలు ప్రకటించారు. ఈ వ్యవధిలో వినియోగదారులు తమకు చెల్లించిన మొత్తానికి పదింతల నగదును పరిహారంగా ఇస్తామన్నారు. మూత్రవిసర్జన ఘటన జరిగిన వెంటనే తమ రెస్టారెంట్లలోని అన్ని హాట్‌పాట్ గిన్నెలను(Diners Urinated), వంట పాత్రలను మార్చేసినట్లు పేర్కొంది. ఇతర పాత్రలను కూడా శుభ్రం చేసినట్లు తెలిపింది. ఈ ఘటన ఫిబ్రవరి నెలలో జరగగా.. హాట్‌పాట్‌లో మూత్రం పోసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని రోజుల తర్వాత హైడిలావ్ యాజమాన్యం స్పందించింది. ఆ టైంలో డ్యూటీలో ఉన్న ఉద్యోగులు.. మద్యం మత్తులోని యువకులను ఆపడంలో విఫలమయ్యారని ఒప్పుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా రెస్టారెంట్లను హైడిలావ్ నిర్వహిస్తోంది.