Site icon HashtagU Telugu

Viral : చైనాలో మరో ఇంజినీరింగ్ అద్భుతం

China Beipan River Huajiang

China Beipan River Huajiang

చైనా (China ) ఇంజినీరింగ్ నైపుణ్యానికి మరో గొప్ప ఉదాహరణగా హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ (Huajiang Grand Canyon) బ్రిడ్జి నిర్మాణం నిలిచింది. గుయ్ ప్రాంతంలోని బీపాన్ నది(Beipan River)పై నిర్మించిన ఈ వంతెన ప్రపంచ రికార్డులను తిరగరాస్తోంది. మొత్తం 2.9 కిలోమీటర్ల పొడవులో, సముద్ర మట్టానికి 2050 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ బ్రిడ్జి ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ఇది లండన్ గోల్డెన్ గేట్ బ్రిడ్జి కంటే తొమ్మిది రెట్లు ఎత్తుగా ఉండగా, ఈఫిల్ టవర్ కంటే రెట్టింపు ఎత్తు కలిగి ఉంది.

Congress Govt : రాష్ట్ర ప్రభుత్వానికి ఎర్రబెల్లి సవాల్

ఈ వంతెన నిర్మాణం ఒక మహా ఇంజినీరింగ్ విజయం. దాని మధ్య భాగంలో 93 విభాగాలు ఉండగా, మొత్తం బరువు సుమారు 22,000 టన్నులు. ఇది ఈఫిల్ టవర్ బరువుకి మూడింతలు. వంతెన నిర్మాణానికి ఉపయోగించిన టెక్నాలజీ, ఎత్తులోని సవాళ్లను అధిగమించిన విధానం అభినందనీయమైనది. వంతెనపైకి డ్రోన్లతో తీసిన వీడియోల్లో మేఘాలు వంతెన ముంగిటగా కనిపించడమే దీనికి సాక్ష్యం.

Free Bus Scheme : మొన్నటి వరకు ఆడోళ్ళు అడోళ్ళు కొట్టుకున్నారు.. ఇప్పుడు మొగోళ్ళు ఆడోళ్ళు

ఇది పూర్తయితే ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న బీపాన్‌జియాంగ్ బ్రిడ్జిని (1788 అడుగుల ఎత్తులో 2016లో నిర్మించినది) రికార్డు పరంగా అధిగమించనుంది. ఇప్పటివరకు గంట సమయం పడే ఈ లోయ ప్రాంతాన్ని ఈ వంతెన ద్వారా కేవలం 2–3 నిమిషాల్లో దాటవచ్చు. ఇది ప్రాంతీయ రవాణాను వేగవంతం చేయడమే కాకుండా, చైనా భారీ మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఎంత ముందుందని చూపిస్తోంది. సుమారు రూ. 2400 కోట్లు ($292 మిలియన్) ఖర్చుతో 2022లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కేవలం మూడు ఏళ్లలోనే పూర్తయ్యింది.