Viral : పానీపూరి అమ్ముతూ మహీంద్రా థార్ ను కొనుగోలు చేసిన 22 ఏళ్ల యువతీ..

  • Written By:
  • Publish Date - January 24, 2024 / 11:36 PM IST

ఈరోజుల్లో బ్రతకడానికి ఎన్నోదారులు..కేవలం చదువుకుంటేనే బ్రతకగలం అనే రోజులు పోయాయి..కష్టపడి..సరికొత్త ఆలోచనలతో వ్యాపారాలు చేస్తే ఈజీ గా మనీ సంపాదించవచ్చు..తాజాగా ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల యువతీ కేవలం పానీపూరి అమ్ముతూ నెలకు రూ.9 లక్షలు సంపాదించడమే కాదు..మహీంద్రా థార్‌ కారును కొనుగోలు చేసి..దానితోనే పానీపూరి అమ్ముతుంది. ఏంటి నమ్మడం లేదా..ఇది నిజం.

ప్రస్తుతం పానీపూరి కి ఎంత డిమాండ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీలలోనే ఈ పానీపూరి బండ్లు కనిపించేవి..కానీ ఇప్పుడు మరుమూలా గ్రామాల్లో కూడా పానీపూరి బండ్లు కనిపిస్తున్నాయి. చూసేందుకు చాల చీఫ్ గా కనిపించిన..వీటి రాబడి..లాభాలు ఏ సాఫ్ట్ వెర్ ఉద్యోగికి కూడారవు. ఆ రేంజ్ లో ఈ బిజినెస్ నడుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

చోటూ.. పది రూపాయల పానీపూరీ ఇవ్వు.. అంటాం. ప్లేట్ పట్టుకుంటాం. ఇన్ని ఉల్లిపాయ ముక్కలు ప్లేట్ లో వేసుకొని.. పూరీలో ఇంత చాట్ వేసి.. ఓ రకమైన పానీయంలో ముంచి ప్లేట్ లో పెడతాడు. దాంట్లో కొన్ని ఉల్లిగడ్డ ముక్కలేసుకొని నోట్లో వేసుకుంటే.. ఇట్టే కరిగిపోతుంది పానీపూరి. పానీపూరి అమ్మే వ్యక్తి.. టకా టకా ప్లేట్ లో పానీపూరీ వేస్తూనే ఉంటాడు. మనం ఆరగిస్తూనే ఉంటాం. అలా ఎన్ని వేసినా తింటూనే ఉంటాం. అంతలా నోరూరిస్తుంది పానీపూరీ. చిన్నపిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకు పానీపూరీ అనగానే నోరూరాల్సిందే. పానీపూరీని సౌత్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో గప్ చుప్ అని కూడా పిలుస్తారు. నార్త్ ఇండియాలో మాత్రం గోల్ గప్పా అని పిలుస్తారు.

అలాంటి పానీపూరి అమ్ముతూ నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తుంది ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల తాప్సి. బీటెక్ పూర్తి చేసిన ఈ అమ్మాయి పానీపూరీ విక్రయిస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా 40 స్టాల్స్ ఏర్పాటు చేసి నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తోంది. ఆ డబ్బుతో మహీంద్రా థార్ (Mahindra Thar) కొని దానికి పానీపూరీ బండి కట్టి తీసుకెళ్తుంది. ఇప్పుడు తాప్సీ ఢిల్లీలో ‘బీటెక్ పానీపూరీ వాలీ’ (BTech Pani Puri Wali)గా ఫేమస్ అయింది. ఈ వీడియో ను మహీంద్రా అండ్ మహీంద్రా మోటార్స్‌ అధినేత ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో (ఎక్స్‌) షేర్ చేసాడు.

ఇంటర్నెట్‌లో ఏదైనా విభిన్నమైన సంఘటనలు ఇతర మోటివేషనల్‌ వీడియోలను పంచుకునే ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) మరో వీడియోను తన (ఎక్స్‌) అకౌంట్‌లో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌లో తన కలను నిజం చేసుకునేందుకు ఓ యువతి రేయింబవళ్లు కష్టపడిందని.. పానీపూరీ సెంటర్లు నెలకొల్పి తన కలల కారు మహీంద్రా ఎస్‌యూవీని కొనుగోలు చేసిందని ఆనంద్‌ మహీంద్రా చెప్పుకొచ్చారు. మహీంద్రా థార్‌ వెనకాల పానీపూరీ బండిని లాగుతున్న వీడియోను ఆయన ట్వీట్‌లో జత చేశారు.

Read Also : Janasena : ఎన్నికల వేళ జనసేన కు తీపి కబురు తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం