Viral : చిరుతపులి బారినుండి తెలివిగా తప్పించుకున్న 12 ఏళ్ల బాలుడు..

  • Written By:
  • Publish Date - March 6, 2024 / 11:37 PM IST

సోషల్ మీడియా (Social Media) పుణ్యమా..అని ప్రపంచం లో ఏంజరిగిన క్షణాల్లో తేలిపోతుంది..అద్భుత సంఘటనల నుండి క్రైం సంఘటన వరకు ఘటన సంఘటన ఏదైనా సరే సోషల్ మీడియా లో ప్రత్యక్షము అవుతూ అందరికి తెలిసేలా చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు 12 ఏళ్ల బాలుడు (12-year-old boy)..చిరుత పులి (Leopard ) బారినుండి క్షేమంగా తప్పించుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మాములుగా ఏ చిన్న జంతువు ను చూసిన మనలో ముందుగా భయం వేస్తుంది..అలాంటిది ఆ పిల్లాడు మాత్రం చిరుత పులిని చూసి..ఏమాత్రం భయపడకుండా బయటపడ్డాడు.

ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్‌ జిల్లాలోని మాలెగావ్‌ పట్టణంలో జరిగింది. పట్టణంలోని మోహిత్‌ విజయ్‌ (Mohit Ahire Vijay) అనే పిల్లాడు తన ఇంట్లోని ఆఫీస్​ క్యాబిన్​లో కూర్చొని మొబైల్‌ ఫోన్​లో ఆడుకుంటున్నాడు. అంతలోనే అతడు కూర్చున్న గదిలోకి సడెన్ గా ఓ చిరుతపులి ప్రవేశించింది. ఆ చిరుతను చూసిన పిల్లాడు ఏ మాత్రం భయపడకుండా సెకన్ల వ్యవధిలోనే ఆ గది నుంచి బయటకు వెళ్లి చిరుత బయటకు రాకుండా తలుపు వేశాడు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం తల్లిదండ్రుల సాయంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది ఆ చిరుతకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసింది. అనంతరం దానిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేశారు. అయితే చిరుతను చూసి అస్సలు భయపడకుండా దానిని బంధించేందుకు మోహిత్‌ విజయ్‌ ప్రదర్శించిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్​ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read Also : KTR : ‘తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన ఖర్మ’ అంటూ రేవంత్ ఫై కేటీఆర్ ట్వీట్