Site icon HashtagU Telugu

Karnataka : ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు తిరిగే నదిలో పడేసిన తల్లి..

Boy Dies After Mother Throw

Boy Dies After Mother Throw

x
నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డను మొసళ్లు (Crocodile) తిరిగే నదిలో పడేసిన ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది. దీనికి కారణం ఆ పిల్లాడు మూగ వాడవ్వడమే. వివరాల్లోకి వెళ్తే.. రవికుమార్​(27) అతడి భార్య సావిత్రి(26).. ఇద్దరు పిల్లలతో దండేలి మండలంలో నివసిస్తున్నారు. అయితే అతడి పెద్ద కుమారుడు వినోద్​(6) పుట్టు మూగ. వినోద్​ పరిస్థితి గురించి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అలాంటి బిడ్డను ఎందుకు కన్నావు? అతడిని దూరంగా విసిరేయమంటూ భార్యను వేధించేవాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య శనివారం గొడవ పెద్దదైంది. దీంతో మనస్తాపానికి గురైన సావిత్రి తన కుమారుడు వినోద్​ను మొసళ్లు ఉన్న కెనాల్​లో పడేసింది. ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు, గజఈతగాళ్లు, ఫైర్​ సిబ్బంది సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే చీకటి కావడం తో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడింది. సోమవారం ఉదయానికల్లా బాలుడు మృతదేహాన్ని వెలికితీశారు. అతడి మృతదేహంపై గాట్లు ఉన్నాయి. అలాగే ఒక చేయి కూడా లేదు. దీంతో మొసళ్ల దాడిలో బాలుడు మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం పరీక్షల కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాలుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్థానికులు ఆ తల్లి ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : SIT Launches Helpline: లైంగిక బాధితుల కోసం సిట్ హెల్ప్‌లైన్ నంబర్‌