Bihar : అయ్యో అని అల్లుడ్ని చేరదీస్తే..అత్తానే లైన్లో పెట్టి పెళ్లి చేసుకున్నాడు

పిల్లలు పుట్టిన తర్వాత సికందర్ యాదవ్ భార్య చనిపోయింది. దీంతో సికందర్ యాదవ్‌ను, ఇద్దరు పిల్లలను.. అత్తామామలు గీతాదేవి, దిలీశ్వర్ దార్వే తీసుకువచ్చి తమ ఇంట్లో ఉంచుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Bihar Man Marries Mother In

Bihar Man Marries Mother In

ఇటీవల కాలంలో బంధాలు..అనుబంధాలు అనేవి దారుణంగా తయారయ్యాయి. వావివరుసలు మరచి సభ సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. తాజాగా కూతురి మరణంతో అల్లుడిని ఇంటికి తీసుకొచ్చి చేరదీస్తే..ఏకంగా పిల్లను ఇచ్చిన తల్లినే లైన్ లో పెట్టి ఏకంగా ఆమెనే రెండో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. సికందర్ యాదవ్ (45) అనే వ్యక్తికి గతంలో పెళ్లి కాగా.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత సికందర్ యాదవ్ భార్య చనిపోయింది. దీంతో సికందర్ యాదవ్‌ను, ఇద్దరు పిల్లలను.. అత్తామామలు గీతాదేవి, దిలీశ్వర్ దార్వే తీసుకువచ్చి తమ ఇంట్లో ఉంచుకున్నారు. ఈ క్రమంలోనే 55 ఏళ్ల గీతా దేవితో.. సికందర్ యాదవ్‌ ప్రేమాయణం కొనసాగించడం స్టార్ట్ చేసారు. అయితే వీరిద్దరి మధ్య దిలీశ్వర్ దార్వేకు అనుమానం మొదలైంది.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో వారిపై నిఘా పెట్టగా.. ఒకరోజు వారిద్దరి మధ్య సంబంధం బయటపడింది. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో దిలీశ్వర్ దార్వే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని , గ్రామ పెద్దల మధ్య పంచాయితీ పెట్టించాడు. అందరి ముందు తనకు అత్త గీతా దేవీ అంటే ఇష్టమని.. అల్లుడు సికందర్ యాదవ్ తెలిపాడు. ఆమెను ప్రేమిస్తున్నానని.. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పడంతో అక్కడ ఉన్న వారంతా అది విని ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఇది విని చేసేదేమీ లేకపోవడంతో మామ దిలీశ్వర్ దార్వే కూడా వారి పెళ్లికి ఒప్పుకున్నాడు. దీంతో అంతా చూస్తుండగానే అత్త నుదిటిపై సికందర్ యాదవ్ బొట్టు పెట్టాడు. అల్లుడిని ఇంట్లో తీసుకువవచ్చి పెట్టుకున్న పాపానికి.. అత్తను ప్రేమించి, చివరికి ఆమెను పెళ్లి చేసుకోవడంతో.. మామ ఒంటరిగా మారాడు. ఈ ఘటన కు సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : Congress List: మరో నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్

  Last Updated: 30 Apr 2024, 10:48 PM IST