Site icon HashtagU Telugu

AUS vs PAK: మైదానంలో పావురాలు.. ఫన్నీ వీడియో

AUS vs PAK

AUS vs PAK

AUS vs PAK: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. లబుషేన్, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పావురాల వల్ల ఆటకు అంతరాయం కలిగింది.

స్ట్రైకింగ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ పావురాల గుంపును చూసి పక్కకు తప్పుకున్నాడు. దీంతో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మార్నస్ ల‌బుషేన్ ప‌రుగెత్తుకుంటూ వెళ్లి బ్యాటును గాల్లోకి ఊపుతూ వాటిని తరిమే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆ పావురాల్ని బయటకు పంపించడానికి లబుషేన్ తెగ కష్టపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే పాకిస్థాన్ ఈ టెస్టులో తప్పకుండా గెలవాల్సి ఉంది. అయితే రెండో టెస్టులో భాగంగా నిన్న తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి లబుషేన్ 44 పరుగులు, ట్రావిస్ హెడ్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Also Read: Karnataka: దుకాణాల నేమ్‌ప్లేట్లలో 60% కన్నడ అక్షరాలు ఉండాలి