ఒకప్పుడు హైదరాబాద్ గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో(Gudimalkapur Flower Market) కూలీగా పనిచేసిన అరూప్ కుమార్ ఘోష్ (Arup Kumar Ghosh)ఇప్పుడు ఏడాదికి రూ.5 కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తూ వ్యాపారవేత్తగా మారడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అరూప్, తండ్రి వ్యవసాయంలో నష్టపోవడంతో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగానే చదువును మానేసి, కోలాఘాట్‌లోని పూల మార్కెట్లో కూలీగా పనిచేశాడు. అక్కడి అనుభవంతో గుడిమల్కాపూర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టాడు. రోజుకు రూ.3500 జీతంతో పూల దుకాణంలో పనిచేస్తూ పూల వ్యాపారం మీద పూర్తి అవగాహన సంపాదించాడు.
Indrayani River Collapse : ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలి ఆరుగురు మృతి
ఈ అనుభవాన్ని తీసుకొని స్వస్థలానికి వెళ్లి, మొదట రెండు ఎకరాల్లో బంతిపూల సాగును ప్రారంభించాడు. మొదట్లో లాభాలకంటే నష్టాలే ఎదురైనా, పట్టుదలతో ముందుకెళ్లాడు. ఒకసారి థాయ్ లాండ్ వెళ్లినప్పుడు టెన్నిస్ బాల్ లాంటి పెద్ద బంతిపూల రకాన్ని చూశాడు. వాటిని సాగు చేయాలనే ఆలోచనతో అక్కడి నుంచి విత్తనాలు తెచ్చి తన పొలాల్లో వేయడంతో 45 రోజుల్లోనే పువ్వులు వచ్చాయి. కిలో రూ.100 చొప్పున విక్రయించి మంచి లాభాలు పొందాడు. దీని వలన ఇతర రైతులు కూడా విత్తనాల కోసం ఆశ్రయించడంతో వ్యాపారం విస్తరించాడు.
తర్వాత 6 ఎకరాలు లీజుకు తీసుకొని “ఏకేజీ నర్సరీ” అనే సంస్థను స్థాపించి విత్తనాలు, మొక్కలు విక్రయించడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు వేల మంది రైతులకు ఉత్తమ నాణ్యత గల బంతిపూల విత్తనాలను సరఫరా చేసి ఆదర్శంగా నిలిచాడు. కేవలం కూలీగా పని చేసిన అనుభవంతో కాకుండా, వైఫల్యాలను గమనిస్తూ కొత్త మార్గాలను అన్వేషించిన అరూప్ ఘోష్ యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తున్నాడు.