Site icon HashtagU Telugu

Wayanad Landslides : అది ఇండియన్ ఆర్మీ అంటే ..

Temporary Bridge In Wayanad

Temporary Bridge In Wayanad

ఇండియన్ ఆర్మీ (The Indian Army) అంటే చెప్పాల్సిన పనిలేదు..ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం పోరాడుతున్నారు. అంతే కాదు ఎలాంటి విపత్తులు వచ్చిన ప్రజలను కాపాడుతుంటారు. ప్రమాద అంచులవరకు వెళ్లి మరి ప్రజలను రక్షిస్తుంటారు. ఇలాంటివి ఎన్నో చూసాం.,మాట్లాడుకున్నాం..చదువుకున్నాం. తాజాగా కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటన దేశ వ్యాప్తంగా విషాదానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఘటనలో ఇప్పటి వరకు 290కి పైగా ప్రజలు మరణించారు. ప్రకృతి సృష్టించిన బీభత్సంలో రోడ్లు, ఇళ్లు కానరాకుండాపోయాయి. ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంట్లలోనే రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ బాధితులను కాపాడేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఓ వైపు మృతదేహాలను వెలికితీయడంతో పాటు మరో వైపు సహాయక చర్యలను ముమ్మరంగా నిర్వహిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇందులో భాగంగా ముందక్కై-చురాల్‌మల (Mundakai and Chooralmala) మధ్య 24 గంటల్లోనే బ్రిడ్జి (Bailey bridge)నిర్మించి సంచలనం సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ధ్వంసమైన వయనాడ్‌లోని మెప్పాడి- చురల్మల ప్రాంతంలో సైన్యం తాత్కాలిక బ్రిడ్జి నిర్మించింది. సైన్యానికి చెందిన మద్రాస్‌ ఇంజినీర్‌ గ్రూప్‌ దాదాపు 150 అడుగుల వంతెనను నిర్మించింది. 123 మంది సైనికులు దీని కోసం అహోరాత్రులు శ్రమించారు. ఈ బ్రిడ్జి ద్వారా రాకపోకలకు మార్గం సుగమమవుతుంది. సహాయ సామగ్రి, నిత్యావసర వస్తువులు తరలించేందుకు సహాయక సిబ్బందికి వీలు కలుగుతుంది. ఈ బ్రిడ్జిపై ఆర్మీ వెహికిల్ తో ట్రయల్ రన్ ను సైతం నిర్వహించారు. ఇది సక్సెస్ కావడంతో భావోద్వేగానికి గురైన ఆర్మీ సిబ్బంది, స్థానికులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు.

Read Also : Shouryuv : ఎన్టీఆర్ తో సినిమా – హాయ్ నాన్న డైరెక్టర్ క్లారిటీ