100 Items In Stomach : కడుపులో 100 వస్తువులు.. సర్జరీ చేసి తీసిన డాక్టర్స్

100 Items In Stomach : గత రెండేళ్లుగా నిత్యం కడుపు నొప్పి వేధిస్తుండటంతో అతడు చాలా బాధపడ్డాడు.

Published By: HashtagU Telugu Desk
100 Items In Stomach

100 Items In Stomach

100 Items In Stomach : గత రెండేళ్లుగా నిత్యం కడుపు నొప్పి వేధిస్తుండటంతో అతడు చాలా బాధపడ్డాడు. ఎంతకూ నొప్పి తగ్గకపోవడంతో ఇటీవలల పంజాబ్‌లోని మోగాలో ఉన్న ఓ హాస్పిటల్ కు వెళ్లాడు. 40 ఏళ్ల ఆ వ్యక్తి పొట్టను స్కాన్ చేసిన వైద్యులు షాక్ కు గురయ్యారు. పొట్టలో ఏమేం ఉన్నాయో చూసి ఆశ్చర్యపోయారు. కడుపులో అనేక లోహ వస్తువులు ఉన్నాయని గుర్తించారు.  తాజాగా గురువారం అతడికి మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఆపరేషన్ చేసిన వైద్యులు.. కడుపులో నుంచి ఇయర్‌ఫోన్‌లు, లాకెట్‌లు, స్క్రూ, రాఖీలు,  వాచర్లు, నట్స్, బోల్ట్‌లు, వైర్లు, లాకెట్లు, బటన్లు, రేపర్లు, హెయిర్‌ క్లిప్‌లు, జిప్పర్ ట్యాగ్, మార్బుల్,  సేఫ్టీ పిన్ బయటికి తీశారు.

Also read : 8000 Jobs : అంగన్వాడీ కేంద్రాలలో 8వేల జాబ్స్.. త్వరలో నోటిఫికేషన్

ఆ వ్యక్తి పొట్ట నుంచి దాదాపు వంద వస్తువులను బయటికి తీశామని డాక్టర్లు వెల్లడించారు. ఇలాంటి కేసు ఎదురవడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఆ వస్తువులు చాలాకాలం పాటు  పొట్టలో ఉండటం వల్ల అతడికి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా క్రియేట్ చేశాయని తెలిపారు. బాధిత వ్యక్తి కొంతకాలం పాటు మానసిక వ్యాధులతో బాధపడ్డాడని, బహుశా ఆ టైంలో వీటిని తినేసి ఉండొచ్చని కుటుంబీకులు (100 Items In Stomach) చెప్పారు.

  Last Updated: 29 Sep 2023, 08:38 AM IST