Burger House Viral : బర్గర్‌ ఇల్లు..భలేగా ఉందే..!!

AI-Generated Burger-Themed House Sparks Viral : బర్గర్‌ తినడం..అలాంటి ఆకారంలో ఉన్న ఇంట్లో (Burger-Themed House) ఉంటె ఎంత బాగుంటుందో కదా..తాజాగా ఈ ఐడియా తో ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఏఐను ఉపయోగించి బర్గర్ వర్చువల్‌ ఇంటిని రూపొందించి

Published By: HashtagU Telugu Desk
Ai Generated Burger Themed

Ai Generated Burger Themed

AI-Generated Burger-Themed House Sparks Viral : బర్గర్‌ (Burger) ..ఇది అందరికి ఎంతో ఇష్టం..చూస్తేనే అబ్బా తింటే బాగుండు అనిపించే రూపంలో ఉంటుంది. అలాగే టైం పాస్ కోసం అందరు ఇష్టంగా తింటుంటారు. అలాంటి బర్గర్‌ తినడం..అలాంటి ఆకారంలో ఉన్న ఇంట్లో (Burger-Themed House) ఉంటె ఎంత బాగుంటుందో కదా..తాజాగా ఈ ఐడియా తో ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఏఐను ఉపయోగించి బర్గర్ వర్చువల్‌ ఇంటిని రూపొందించి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం తో ఆది కాస్త వైరల్ గా మారింది.

ఇంట్లోకి ప్రవేశించగానే లోపల బర్గర్ ఆకారంలోని సోఫా, బెడ్‌, చీజ్‌తో నిండి ఉన్న ప్రత్యేకమైన బాత్‌టబ్‌, బర్గర్ వాష్‌రూమ్‌, కిచెన్‌, స్విమ్మింగ్ పూల్ కనిపిస్తాయి. ఎటుచూసినా నోరూరించే రకరకాల బర్గర్లు కనువిందు చేస్తూ నోరూరిస్తాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బ్రెజిల్‌కు చెందిన మెక్‌డొనాల్డ్స్‌ స్పందించింది. ”ఈ ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆలోచనా విధానం బర్గర్‌లను బాగా ఇష్టపడే చిన్నపిల్లల సంబరంలా ఉంది” అంటూ రాసుకొచ్చింది.

Read Also : Brahmaji Tweet : నేను ఆ పోస్ట్ పెట్టలేదు..నా ఎక్స్‌ ఖాతాని ఎవరో హ్యాక్‌ చేశారు – బ్రహ్మజీ

  Last Updated: 08 Sep 2024, 11:48 AM IST