Site icon HashtagU Telugu

AC Helmets: ఏసీ హెల్మెట్.. పోలీసులకు ఎంతో హాయి!

Ac Helmets

Ac Helmets

హైదరాబాద్ (Hyderabad) లాంటి నగరంలో నిత్యం ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంటుంది. మండుటెండలో సైతం ట్రాఫిక్ (Traffic) అంతరాయం ఏర్పడుతుంది. నిత్యం వేలాది వాహనాల రాకపోకలను కంట్రోల్ చేయాలంటే పోలీసులకు (Police) కత్తి మీద సాములాంటిదే. ఎండలో విధులు నిర్వహిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు.

హైదరాబాద్‌ నగరంలో వేసవిలో (Summer) ప్రధాన రహదారుల కూడళ్ల వద్ద విధులు నిర్వహించే ట్రాఫిక్‌ సిబ్బంది కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏసీ హెల్మెట్లు ఇవి. రాచకొండ సీపీ వీటిని రెండు రోజుల క్రితం ప్రయోగాత్మకంగా కొంతమంది సిబ్బందికి అందజేశారు. బ్యాటరీతో నడిచే ఈ హెల్మెట్‌ లోపల, ముఖానికి, మూడు వైపుల నుంచి చల్లని గాలి వీచేలా తయారుచేశారు.

Also Read: Custody Trailer: పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టిన చైతూ, కస్టడీ ట్రైలర్ ఇదిగో!