Site icon HashtagU Telugu

Guatemala : ఈమె పిజ్జా ఎక్కడ తిందో తెలుసా? తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు..

A Women cook and Eat Pizza at Guatemala Valcano

A Women cook and Eat Pizza at Guatemala Valcano

పిజ్జా తినాలని అందరం అనుకుంటాం. దానిలో కొందరికి స్పెషల్ టేస్ట్ ఉంటుంది. కొందరు పిజ్జా హట్ లో తినాలనుకుంటే ఇంకొందరు US పిజ్జాలోనే తినాలి అనుకుంటారు. మరి కొందరికి డామినోస్ పిజ్జా అంటే మహా ఇష్టం. సో పిజ్జాకి ప్లేస్ ఇంపార్టెంట్ కానీ ఈవిడెంటో పిజ్జా తినడానికి వెరైటీ ప్లేస్ ఎంచుకుంది. అది ఏ ఫుడ్ కోర్ట్ కాదు.. అగ్ని పర్వతం.. భగభగ మండే అగ్నిపర్వతం.

అలెగ్జాండ్రియా బ్లాడ్జెట్ (Alexandria Blodgett) అనే మహిళకు సరదాగా అగ్నిపర్వతం మీద పిజ్జా చేసుకుని తినాలనిపించింది. ఇంకెందుకు ఆలస్యం హ్యాపీగా గ్వాటేమాలకు రెడీ అయిపోయింది. అక్కడికి చేరుకొని ఆక్టివ్ గా ఉన్న ఒక అగ్నిపర్వతంపై పిజ్జా తయారు చేసుకొని తింది. ఆ వీడియో తీసి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసుకుంది. యాక్టివ్ గా ఉన్న ఒక అగ్నిపర్వతంపై పిజ్జా చేసుకుని తినడానికి గ్వాటేమాలకు వచ్చాను. అంటే అక్కడి ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడటానికి కూడా అని పోస్ట్ పెట్టింది.

2021లో బద్దలైన ఈ అగ్నిపర్వతం ఇప్పటికి యాక్టివ్ గానే ఉంది. నిజానికి ఇది ఒక నేషనల్ పార్కు. ఇందులోనికి వెళ్లాలంటే తప్పనిసరిగా గైడ్ ఉండాలి. అంతే కాదు పిజ్జా తయారు చేసుకోవడం కోసం అన్నీ ముందుగానే అన్నీ బుక్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఒక వ్యక్తి కూరగాయలతో చీజ్ వేసి రెడీ చేసిన పిజ్జాను ట్రై లో పెట్టి తీసుకొచ్చి కింద పెట్టాడు. తరువాత దానిని కుక్ చేశారు. అది తింటూ అలెగ్జాండ్రియా బ్లాడ్జెట్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

 

Also Read : Chandrayaan-3 Journey Pictures : చంద్రయాన్ 3పై అమర్చిన కెమెరా పంపిన ఫోటోలు చూశారా !