Site icon HashtagU Telugu

Viral News : వ్యక్తిని మూడు కిలోమీటర్లు లాక్కెళ్లిన ఎంపీ కారు డ్రైవర్.. వీడియో వైరల్

a person hanging on the car bonnet by a car driver

a person hanging on the car bonnet by a car driver

దేశరాజధాని ఢిల్లీలో(Delhi) మరో భయానక ఘటన వెలుగుచూసింది. ఒక కారును(Car) నడుపుతున్న డ్రైవర్(Driver) మరో వ్యక్తిని కారు బ్యానెట్ కు వేలాడదీసుకుంటూ మూడు కిలోమీటర్ల మేర కారును నడుపుతున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నాడు. ఆ వ్యక్తి పట్ల అంత అమానుషంగా ప్రవర్తించిన డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఏప్రిల్ 30,2023 ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ నుండి నిజాముద్దీన్ దర్గా వైపుగా వస్తోన్న కారు బ్యానెట్ పై ఒక వ్యక్తిని సుమారు 3 కిలోమీటర్ల వరకూ లాక్కెళ్లారు. ఆ కారు నడిపిన వ్యక్తిని పోలీసులు బీహార్ ఎంపీ డ్రైవర్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదివారం ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ నుండి నిజాముద్దీన్ దర్గా వరకూ 2-3 కిలోమీటర్ల వరకూ ఓ వ్యక్తిని కారు బ్యానెట్ కు తగిలించుకుని కారును నడిపాడు డ్రైవర్. ఆ కారు బీహార్ కు చెందిన లోక్ సభ ఎంపీ చందన్ సింగ్ కు చెందినదిగా గుర్తించారు. సదరు డ్రైవర్ పేరు చేతన్ గా తెలిపారు పోలీసులు. తానొక సాధారణ డ్రైవర్ ని అని, ఒక ప్రయాణికుడిని దింపి వస్తుండగా ఎంపీ డ్రైవర్ చేతన్ తన పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించాడని హింసకు గురైన రామ్ చంద్ కుమార్ పోలీసులకు తెలిపాడు. తనకారును చేతన్ ఢీ కొట్టగా ఎందుకిలా చేశావని అడిగినందుకు తనను బ్యానెట్ కు తగిలించి ఇంతదూరం లాక్కొచ్చాడని వాపోయాడు. కారును ఆపాలని ఎంత బ్రతిమిలాడినా వినలేదని తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Also Read :  CM KCR : మేడే నాడు పారిశుద్ధ్య, ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ కానుక..