Site icon HashtagU Telugu

Wayanad Landslides : తల్లి ప్రేమకు చాటిలేదు అని నిరూపించిన కోతి

Monkey Kerala

Monkey Kerala

‘అమ్మ’ను మించి దైవమున్నదా.. ఆత్మను మించి అద్దమున్నదా.. జగమే పలికే శాశ్వత సత్యమిదే.. అనే పాట విన్నప్పుడల్లా అమ్మ గుర్తుకు వస్తుంది. అడిగితే వరాలిస్తాడనే నమ్మకంతో దేవునికి గుడి కట్టి పూజిస్తాం.. అలాంటిది అడగకుండానే అన్నీ ఇచ్చే అమ్మకు ఎన్ని గుడిలు కట్టిన తక్కువే. సృష్టికి మూలం అమ్మ.. ఆమెను మించిన దైవం లేదు. అమ్మ పంచే ప్రేమ ముందు సృష్టిలో ఏదీ సరితూగదు. అలాంటి అమ్మకున్న ఉన్నత స్థానాన్ని, విలువను మరింత గొప్పగా చాటి చెబుతున్న ఘటనలు ఎన్నో చూస్తుంటాం. కేవలం అమ్మ ప్రేమ మనుషుల్లోని కాదు..మూగజీవుల్లో కూడా ఉంటుంది. తాజాగా కేరళ రాష్ట్రం, వయనాడులో జరిగిన విధ్వంసం తరువాత.. ఒక కోతి తను కన్న కోతిపిల్లను కాపాడుతున్న విధానం అందర్నీ కంటతడిపెట్టిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

కేరళలోని వయనాడ్‌(Wayanad )లో ప్రకృతి సృష్టించిన విలయతాండవం అంత ఇంత కాదు. కొండ చరియలు విరిగిపడిన ఘటన దేశ వ్యాప్తంగా విషాదానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 400 కు పైగా ప్రజలు మరణించారు. ప్రకృతి సృష్టించిన బీభత్సంలో రోడ్లు, ఇళ్లు కానరాకుండాపోయాయి. ఎన్నో వేల చెట్లు నేలమట్టం అయ్యాయి. వందలాది మూగజీవాలు బండరాళ్ల మధ్యలో, వరద బురదలో చిక్కుకుపోయి ప్రాణాలు వదిలాయి. పెంపుడు కుక్కలు సైతం గత వారం రోజులుగా బురదలో కూరుకుపోయి ఆర్తనాదాలు చేస్తున్నాయి. అలాగే వాటి యజమానులు సైతం తమ పెంపుడు కుక్కలా కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కోతి బురదలో కురుకపోయిన తను కన్న కోతిపిల్లను కాపాడుతున్న విధానం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా అమ్మ ప్రేమను మించి ప్రేమ మరోటి ఉండదు..దొరకదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Nagababu : ‘అల్లు’ అంటూనే..బన్నీ ఫై నాగబాబు పరోక్షంగా కీలక వ్యాఖ్యలు..?