Site icon HashtagU Telugu

God Gift : దేవుడికి పెట్రోల్ పంపును గిఫ్ట్ గా ఇచ్చిన భక్తుడు

Devotee Offered A Silver Pe

Devotee Offered A Silver Pe

రాజస్థాన్‌లోని చిత్తోరగఢ్‌కు చెందిన ఓ వ్యాపారి తన కోరిక నెరవేరిన సందర్భంగా వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తనకు పెట్రోల్ బంక్ ప్రారంభించాలనే కల నెరవేరిన ఆనందంలో, సమీపంలోని ప్రసిద్ధ సన్వాలియా సేథ్ దేవాలయానికి ప్రత్యేకమైన కానుకను సమర్పించారు. దేవుడికి తన కృతజ్ఞతగా, 10 కిలోల వెండితో తయారుచేసిన పెట్రోల్ పంప్ రూపంలోని విగ్రహాన్ని అందించారు.

Texas : అమెరికా టెక్సాస్‌లో వర్షబీభత్సం.. కళ్ల ముందే రోడ్లు మాయం.. 82 మంది మృతి

ఈ వెండి పెట్రోల్ పంప్‌ను కుటుంబ సభ్యులతో కలిసి తలపై మోస్తూ ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అందరూ ఆనందంగా నృత్యాలు చేస్తూ, సంగీతంతో సంబరాలు జరిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, దేవుడికి ఈ విగ్రహాన్ని సమర్పించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భక్తుడి అంకితభావం మరియు వినూత్న భక్తి పద్ధతిపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

ఇప్పటికే సన్వాలియా సేథ్ ఆలయంలో ఇలాగే ఎంతోమంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తరువాత వెండి వస్తువులు, దానాలు సమర్పించడం అలవాటుగా మారింది. కాని ఈ వ్యాపారి ఇచ్చిన వెండి పెట్రోల్ పంప్ విగ్రహం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఇది భక్తి, వ్యాపార విజయాల మేళవింపు ఎలా ఉంటుందో చూపించే ఉదాహరణగా మారింది.

Exit mobile version