మధ్యప్రదేశ్‌లోని భోపాల్ (Bhopal) శివారులో రహస్యంగా పార్క్ చేసి ఉంచిన ఒక కారు (Car ) లో నుండి భారీగా బంగారం, నగదు వెలికితీసిన ఘటన సంచలనంగా మారింది. పోలీసులు కారును తనిఖీ చేస్తూ 52 కిలోల బంగారం, రూ. 10 కోట్ల నగదును (52 kg, along with Rs 9.86 crore in Cash) సీజ్ చేశారు. బంగారం విలువ సుమారు రూ. 42 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కారును భోపాల్ శివారులో అడవిలో ప్రదేశంలో పార్క్ చేసినట్లు గుర్తించారు. భోపాల్‌లోకి వెళ్లే ప్రధాన రహదారిలో ఆడిటింగ్ సమయంలో పోలీసులు ఒక అనుమానాస్పద కారును గుర్తించారు. కారు అదికారిక పత్రాలు లేకపోవడంతో వారు సీజ్ చేసి లోపల తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో కారు లోపల పెద్ద సంచులలో బంగారం గోల్డ్ బిస్కెట్లు, రూ. 2000, రూ. 500 నోట్ల కట్టలు కనపడ్డాయి. ఇంత డబ్బు , బంగారం చూసి పోలీసులు షాక్ అయ్యారు. వాహనంపై ఎలాంటి గుర్తింపు లేదని, వాటిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులపై పలు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం. ఐటీ శాఖ రైడ్స్ నేపథ్యంలో దొరికిపోకుండా ఈ బంగారం, నగదును ఇక్కడ విడిచిపెట్టివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు స్థానిక సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. కారును ఎవరు తీసుకుని వచ్చారు? ఎందుకు ఇక్కడ వదిలేశారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. ఈ బంగారం అక్రమంగా నిల్వచేసినదా, లేదా పన్ను ఎగవేతదారుల ఆస్తులా అన్న దానిపై దృష్టి సారించారు. భోపాల్‌లో ఈ భారీ బంగారం, నగదు పట్టివేత వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఐటీ శాఖ కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆస్తుల మూలాలు తెలుసుకునేందుకు సిద్ధమవుతోంది.
Read Also : Formula E Race Case : కేటీఆర్ కు ఈడీ షాక్