Site icon HashtagU Telugu

4 Trains on One Track : ఒకే ట్రాక్ ఫై నాలుగు రైళ్లు.. ఎందుకు జరిగిందో రైల్వే క్లారిటీ..!!

4 Trains On One Track

4 Trains On One Track

ఇటీవల కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు (Train Accidents) ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు ఎంతో ఆధునిక టెక్నాలజీ తో రైళ్లు నడుపుతున్నప్పటికీ..మన దేశంలో (India) మాత్రం కొంతమంది అధికారులు తమ నిర్లక్ష్యాన్ని మాత్రం వీడడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో రైళ్ల అలస్యం అటుంచి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇతర దేశాల్లో గంటకు మూడు నాలుగు వందల కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంటుంటే మన దేశంలో మాత్రం రైలు కోసం ఇంకా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా రైల్వే లైన్లను ఆధునీకరిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారుల నిర్లక్ష్యంతో రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా సిగ్నల్ లోపాలు , భద్రతా లోపాల కారణంగా రైలు ప్రమాదాలు అనేకంగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టంతో పాటు ఆస్థి నష్టం వాటిల్లుతున్నాయి. దీంతో ప్రయాణికులు భద్రతాలోపం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..భారత రైల్వే ఫై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఒకే ట్రాక్ ఫై నాల్గు రైళ్లు (4 trains on one track in ) రావడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ఘటన ఒడిశా(Odisha)లోని భువనేశ్వర్లో ఉన్న లింగరాజ్ పాసింజర్ స్టేషన్ వద్ద జరిగింది. ఈ వీడియో చూసిన పలువురు రైల్వేలోని భద్రతా లోపాలకు అద్దం పడుతోందని విమర్శలు కురిపిస్తున్నారు. దీనిపై ఈస్ట్ కోస్ట్ రైల్వే క్లారిటీ ఇచ్చింది. పాసింజర్ హాల్ట్ వద్ద ఒకే ట్రాక్ ఫై అనేక రైళ్లు నిలపొచ్చని తెలిపింది. ఇది భద్రతాపరమైన లోపం ఏమాత్రం కాదని క్లారిటీ ఇచ్చింది.

Read Also : CM Revanth : అక్బరుద్దీన్ ఒవైసీ కి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం ఆఫర్