Site icon HashtagU Telugu

Viral: ప్రభుత్వ వాటర్ ట్యాంక్‌లో 25 పాములు

25 Snakes In Water Tank

25 Snakes In Water Tank

Viral: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలోని ఓ గ్రామంలో పాముల భయంతో గ్రామస్థులు పొలాల్లోకి వెళ్లడం మానేశారు. సాక్షాత్తూ ప్రభుత్వ వాటర్ ట్యాంక్‌లో అనేక పాములు కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. మొదట కొండచిలువను చూసిన గ్రామస్థులు పొలాల్లోంచి పరుగులు తీశారు. మొదట గ్రామస్తులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అనంతరం అటవీ శాఖ బృందానికి ఫోన్ చేసి సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారంతో అటవీశాఖ బృందం కొండచిలువలను రక్షించేందుకు ఇటావాకు చేరుకుంది. అటవీ శాఖ బృందం కొండచిలువను రక్షించడంతో పదుల సంఖ్యలు పాములు బయటకు వచ్చాయి. ఈ ఘటనతో అటవీ శాఖ బృందం కూడా షాక్‌కు గురైంది. వాస్తవానికి ప్రభుత్వ వాటర్ ట్యాంక్ చాలా లోతుగా ఉంది. దీంతో అటవీశాఖ అధికారులు వాటిని వెలికితీయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అటవీ శాఖ బృందం 24 కొండచిలువ పాములను రక్షించింది. ఈ పాములలో క్రైట్ అనే విషపూరిత పాము కూడా ఉంది. ట్యాంకు నుంచి పాములు బయటకు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. తాము ఇంతకాలం వాడుతున్న ట్యాంక్‌లో విషపూరిత పాములు, కొండచిలువలు ఉంటాయని తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. సహాయక చర్యలు పూర్తికావడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. చంబల్ అభయారణ్యంలో పట్టుబడిన అన్ని పాములను అటవీ శాఖ బృందం అడవిలో విడిచిపెట్టింది. అదే సమయంలో నీటి ట్యాంక్ దాదాపు 10 అడుగుల లోతులో ఉందని రెస్క్యూ అధికారి తెలిపారు. దీంతో పాములను రక్షించడం చాలా కష్టమైందన్నారు.

వర్షాకాలంలో ట్యాంకులు, ఇళ్ల నుంచి పాములు బయటకు వస్తున్న ఉదంతాలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల రాజస్థాన్‌లోని భిల్వారాలో ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్‌లోని వాటర్ ట్యాంక్‌లో చనిపోయిన పాము కనిపించింది. ఈ సంఘటనతో గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని గొడవ చేసి నెలన్నర గడిచినా పాఠశాల సిబ్బంది వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయలేదని ఆరోపించారు. ఇది కాకుండా బీహార్‌లోని బాలికల హాస్టల్ వాటర్ ట్యాంక్‌లో 42 రస్సెల్ వైపర్ పాములు కనిపించాయి. అటవీశాఖ బృందం హాస్టల్‌కు చేరుకుని పాములను పట్టుకుని అడవిలోకి వదిలారు.

Also Read: KTR : మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్‌ లేఖ