Hyderabad : నీటి సంపులో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షేక్ అక్మల్(24)..నిన్న మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు

Published By: HashtagU Telugu Desk
25 Year Young Man Dies From

25 Year Young Man Dies From

నీటి సంపు (Water Sump)లో పడి చిన్నారి మృతి అనేది ఎక్కువగా వార్తల్లో వింటూ చూస్తుంటాం..కానీ ఇక్కడ 24 ఏళ్ల యువకుడు..సాఫ్ట్ వేర్ ఉద్యోగి నీటి సంపులో పడి చనిపోయిన ఘటన తాజాగా హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాద్లో (Hyderabad) పెద్ద వర్షం పడితే మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉంచుతారు..ఈ కారణంగా కొంతమంది ఆ వాటర్ లో నడుకుంటూ వెళ్తూ అందులో పడి చనిపోయిన ఘటనలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అందుకే ఎప్పటికప్పుడు వర్షం పడినప్పుడల్లా ప్రతి ఒక్కరు మ్యాన్ హోల్ ఉంది..జాగ్రత్త అంటూ చెపుతుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

కానీ ఇప్పుడు హాస్టల్ లోని నీటి సంపులో పడి యువకుడు చనిపోవడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌ (Anjaya Nagar)లో షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షేక్ అక్మల్(24) (Shaik Akmal Sufuyan)..నిన్న మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు సంపులో పడి మృతిచెందాడు. బయట నుండి లోపలి వస్తున్న క్రమంలో నీటి సంపూ ఓపెన్ చేసి పెట్టారు..అది అతడు చూసుకోకుండా నడుచుకుంటూ వస్తూ అందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో బాధితుడి తలకు తీవ్రమైన గాయం కావడం తో అతడు మరణించాడు. సంపు మూత తెరిచి ఉంచినందుకు, భద్రతా చర్యలను నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హాస్టల్ యాజమాన్యంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

 

Read Also : CM Jagan : అదే జరిగితే జగన్ అక్కడిక్కడే మరణించేవారట – పోసాని

  Last Updated: 22 Apr 2024, 05:41 PM IST