12000 Year Old Flutes : 12వేల ఏళ్ల కిందటి ఫ్లూట్.. విశేషాలివీ

ఫ్లూట్.. వేణువు.. పిల్లన గ్రోవి.. దాని మ్యూజిక్ ఎంతో సాఫ్ట్ గా సూపర్బ్ గా ఉంటుంది కదా..ఫ్లూట్ గురించి మాట్లాడుకుంటే మనకు శ్రీకృష్ణుడే గుర్తుకొస్తాడు.. ఇజ్రాయెల్‌ పురావస్తు శాస్త్రవేత్తలు రీసెంట్ గా ఐనాన్-మల్లాహా అనే ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో ప్రాచీన ఫ్లూట్స్ ను గుర్తించారు. అవి ఎంత పాతవో తెలుసా ? 12000 సంవత్సరాల(12000 Year Old Flutes)  కిందటివి !! 

Published By: HashtagU Telugu Desk
12000 Year Old Flutes

12000 Year Old Flutes

ఫ్లూట్.. వేణువు.. పిల్లన గ్రోవి.. 

దాని మ్యూజిక్ ఎంతో సాఫ్ట్ గా సూపర్బ్ గా ఉంటుంది కదా..

ఫ్లూట్ గురించి మాట్లాడుకుంటే మనకు శ్రీకృష్ణుడే గుర్తుకొస్తాడు.. 

ఇజ్రాయెల్‌ పురావస్తు శాస్త్రవేత్తలు రీసెంట్ గా ఐనాన్-మల్లాహా అనే ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో ప్రాచీన ఫ్లూట్స్ ను గుర్తించారు.

అవి ఎంత పాతవో తెలుసా ? 12000 సంవత్సరాల(12000 Year Old Flutes)  కిందటివి !! 

ప్రపంచంలోనే అత్యంత పురాతన వేణువును ఇజ్రాయెల్ లో గుర్తించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు డజనుకుపైగా ఫ్లూట్ ల గుత్తి ఐనాన్-మల్లా అనే ప్రదేశంలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. 12000 ఏళ్ళ(12000 Year Old Flutes) నుంచి ఇవి సేఫ్ గా ఉన్నాయంటే.. వాటిని క్వాలిటీ ఎంత హైలెవల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐనాన్-మల్లా అనే ప్రదేశంలో 1100 పక్షుల ఎముకలు బయటపడ్డాయి. నిశితంగా పరిశీలించగా.. చిన్నపాటి ఫ్లూట్స్ కూడా వాటిలో కలిసిపోయి ఉన్నాయని గుర్తించారు. సముద్రంలో నివసించే చిన్న పక్షుల ఎముకలతో ఈ ఫ్లూట్స్ ను తయారు చేసినట్లు తేలింది. అయితే  వీటిలో ఒక వేణువు మాత్రమే పూర్తి ఆకారంలో ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని పొడవు 2.6 అంగుళాలు (65 మిల్లీ మీటర్లు) ఉందన్నారు. దీనికి సంబంధించిన స్టడీ రిపోర్ట్  “సైంటిఫిక్ రిపోర్ట్స్” అనే జర్నల్‌లో జూన్ 9న పబ్లిష్ అయింది.

Also read : China Pigeons: చైనా.. పావురం కథ!

అప్పట్లో దీన్ని తీగతో కట్టి మెడలో వేసుకునే వారని మేం అంచనా వేస్తున్నాం.. దాన్ని ఊదినప్పుడు యురేషియన్ స్పారోహాక్స్ (అక్సిపిటర్ నిసస్), కామన్ కెస్ట్రెల్ (ఫాల్కో టిన్నున్క్యులస్) లాగానే బిగ్గరగా సౌండ్స్ వస్తున్నాయి ” అని ఈ రీసెర్చ్ లో పాల్గొన్న శాస్త్రవేత్త లారెంట్ డేవిన్ చెప్పారు. ” డేగలాగా పెద్ద శబ్దం రావాలనే ఉద్దేశంతోనే.. 12000 ఏళ్ళ కిందట ఆది మానవులు సముద్ర పక్షుల చిన్నపాటి  ఎముకలతో ఈ ఫ్లూట్స్ ను తయారు చేసుకొని ఉండొచ్చు” అని  పేర్కొన్నారు. డేగలను వేటాడటానికో.. వాటిని బెదిరించడానికో ఈ ఫ్లూట్స్ ను ఆది మానవులు వినియోగించి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. 

  Last Updated: 10 Jun 2023, 12:21 PM IST