Zomato – Ecommerce : ఈ-కామర్స్‌లోకి జొమాటో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌‌లకు పోటీ

Zomato - Ecommerce :  ఈ-కామర్స్ అనగానే మనకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గుర్తుకొస్తాయి.

  • Written By:
  • Updated On - February 19, 2024 / 02:37 PM IST

Zomato – Ecommerce :  ఈ-కామర్స్ అనగానే మనకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గుర్తుకొస్తాయి. ఇక ఈ విభాగంలోకి  జొమాటో కూడా ఎంటర్ కానుంది. దీంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల గుత్తాధిపత్యానికి చెక్ పడనుంది. ఇందుకోసం జొమాటో పెద్ద బిజినెస్ స్కెచ్ రెడీ చేసిందట. ఇందులో భాగంగా జొమాటోకు చెందిన బ్లింకిట్ యాప్‌ను సాధ్యమైనంత వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. తర్వాత విడతల వారీగా బ్లింకిట్ యాప్‌‌లోని కొత్త క్యాటగిరీల్లో మరిన్ని బ్రాండ్స్‌ను జోడిస్తారు. ప్రత్యేకించి ఇంటి అవసరాలు, చిన్న తరహా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, బ్యూటీ ప్రోడక్ట్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను బ్లింకిట్ యాప్‌లో అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన బ్యాకెండ్ స్ట్రక్చర్‌ను సైతం రెడీ చేస్తారు. పువ్వులు, మట్టి దీపాలు, బొమ్మలు వంటి వస్తువుల దగ్గర నుంచి అధిక విలువ కలిగిన స్మార్ట్‌ఫోన్లను కూడా ఇప్పటికే బ్లింకిట్ (Zomato – Ecommerce) విక్రయిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

ఈకామర్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ధీటుగా పనిచేయాలని జొమాట్ యోచిస్తోందట. ఇందుకోసం ఈ-కామర్స్ ఎనేబుల్‌మెంట్ సంస్థ ‘షిప్‌రాకెట్‌’ను కొనుగోలు చేసి.. తమ కంపెనీలో విలీనం చేసుకోవడానికి  జొమాటో ఇప్పటివరకు రెండుసార్లు ట్రై చేసిందట. నేరుగా బ్రాండెడ్ ఉత్పత్తులను సోర్స్ చేయడానికి, స్టాక్‌ నిర్వహణకు, సొంత సప్లై ఛైన్ వ్యవస్థను నిర్మించేందుకు సంబంధించిన సేవలను ‘షిప్‌రాకెట్‌’ కంపెనీ అందిస్తుంటుంది. జొమాటో చేతికి ‘షిప్‌రాకెట్‌’ చిక్కితే.. బ్లింకిట్ విస్తరణకు లైన్ క్లియర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Also Read :Agniveers – Secunderabad : ‘అగ్నివీర్’‌ల భర్తీకి ఏఆర్‌వో సికింద్రాబాద్‌ నోటిఫికేషన్

మన దేశంలోని ఈ-కామర్స్ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆధిపత్యం ఉన్నా.. మీషో, అజియో లాంటి ప్లాట్‌ఫామ్స్ భారీ ఆర్డర్లతో దూకుడుగా కొనసాగుతున్నాయి. అంటే మార్కెట్లో ఇంకా బిజినెస్ చేయడానికి స్కోప్ మిగిలి ఉందన్న మాట. అందుకే ఈకామర్స్ ‌పై ఇప్పుడు జొమాటో ఫోకస్ పెట్టింది.  నేరుగా బ్రాండెడ్ ఉత్పత్తులను సేకరించడం, స్టాక్‌ నిర్వహణ, సొంత సరఫరా వ్యవస్థను నిర్మించడం ద్వారా ఆ దిశగా అడుగులు వేయబోతోంది. ఇలా సేకరించే ఉత్పత్తులను బ్లింకిట్ ద్వారా జొమాటో డెలివరీ చేస్తుంది.