YS Jagan : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆయన మాట్లాడుతూ..గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలను వెల్లడించారు. కూటమిలోని పార్టీల వలే వైసీపీ అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని జగన్ పేర్కొన్నారు. టీడీపీకి ఓటు వేయలేదని మనుషులను కొట్టి కేసులు పెడుతున్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు. వైయస్సార్ విగ్రహాలను పగలగొడుతున్నారు.
Read Also: Palle Bata : ఏప్రిల్ నుంచి పల్లెబాట : సీఎం చంద్రబాబు
ఈ విధంగా దౌర్జన్యాలు చేసి తప్పుడు కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసి రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇలానే పరిస్థితి కొనసాగితే చంద్రబాబుకు బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు. ప్రజల బాగోగులు చూసి ఇన్ని బటన్లు నొక్కిన మన పరిస్థితే ఇలా ఉంటే, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన కూటమి సర్కార్ పరిస్థితి రేపు ఎలా ఉంటుందో ఊహించుకోవాలని కోరారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవని, రాబోయేది జగన్ 2.0 ప్రభుత్వమేనని.. మరో 25 నుంచి 30 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని వదలబోమని మాజీ సీఎం జగన్ స్పష్టం చేశారు.
రైతులకు భరోసా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అతీగతి తెలియదు. ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తానని చెప్పారు. తల్లికి వందనం అని పేరు మార్చారు. కానీ, ఆ డబ్బులు ఏమయ్యాయి? అని నిలదీశారు. ప్రజల్లో వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదు. ప్రజలకు మంచి చేసిన ఓడిపోయాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలను ఇచ్చారు. అందువల్లే 10 శాతం ఓట్లు ఆయనకు అధనంగా వచ్చాయని వైఎస్ జగన్ అన్నారు. ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండరు.. చంద్రబాబు పాపంపండుతుంది. ప్రజల బుద్ధి చెప్పే రోజులు వస్తాయన జగన్ అన్నారు.
Read Also: MLC Elections : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి బీఆర్‌ఎస్ వెనుకడుగుకు గల కారణాలేంటీ..?